Hyderabad Real Estate: రియల్ ఎస్టేట్ పై ఎన్నికల ప్రభావం..ఆస్తుల కొనుగోలుపై నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Hyderabad: స్థిరాస్తి మార్కెట్ నగరం మొత్తం ఒకే తీరున ఎప్పుడూ ఉండదని.. ప్రాంతాలను బట్టి అక్కడి మౌలిక వసతులను బట్టి మారుతూ ఉంటుందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. సర్కారు వేలం వేసిన కోకాపేట, బుద్వేల్, మోకిల వంటి ప్రాంతాల్లో ఈ ప్రభావాలేవీ కనిపించలేదు. భూముల వేలానికి మంచి స్పందన కనిపించింది. బడా సంస్థలు తమ సొమ్ములను హెచ్ఎండీఏకు పూర్తిగా చెల్లించాయని అధికారులు చెప్పారు.

Hyderabad Real Estate: రియల్  ఎస్టేట్ పై ఎన్నికల ప్రభావం..ఆస్తుల కొనుగోలుపై నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Hyderabad Real Estate
Follow us
Vijay Saatha

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 18, 2023 | 3:05 PM

హైదరాబాద్,నవంబర్18; రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ప్రభావం రియల్ ఎస్టేట్ పై కన్పిస్తోంది..ఫ్లాట్ విక్రయాలు ఆశాజనకంగా ఉన్నా.. స్థలాల లావాదేవీల్లో సందిగ్ధత నెలకొంది.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఇది ఇలాగే కొనసాగే సూచనలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా అప్పటికపుడు ధరలు పెరిగే అవకాశం తక్కువ కాబట్టి తమ బడ్జెట్ లో స్థిరాస్తులను కొనుగోలు చేయవచ్చు అంటున్నారు నిపుణులు…

దేశవ్యాప్తంగా స్థిరాస్తి రంగం దూకుడు మీద ఉంది. నగరాలు మంచి జోరు కనబరుస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఇళ్ల విక్రయాలు, కొత్త ప్రాజెక్ట్ ల ప్రకటనలు ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. మన దగ్గర మొన్నటివరకు పరుగులు పెట్టినా.. కొద్దినెలలుగా మార్కెట్ మాత్రం నిలకడగా ఉందని, కొన్ని ప్రాంతాల్లో స్తబ్దుగా ఉందని.. ప్రాంతాలను బట్టి హెచ్చుతగ్గులు ఉంటాయని ఎన్నికల వరకు ఇదే పరిస్థితి అని రియల్టర్లు అంటున్నారు..

స్థిరాస్తి మార్కెట్ నగరం మొత్తం ఒకే తీరున ఎప్పుడూ ఉండదని.. ప్రాంతాలను బట్టి అక్కడి మౌలిక వసతులను బట్టి మారుతూ ఉంటుందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. సర్కారు వేలం వేసిన కోకాపేట, బుద్వేల్, మోకిల వంటి ప్రాంతాల్లో ఈ ప్రభావాలేవీ కనిపించలేదు. భూముల వేలానికి మంచి స్పందన కనిపించింది. బడా సంస్థలు తమ సొమ్ములను హెచ్ఎండీఏకు పూర్తిగా చెల్లించాయని అధికారులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్లో ఇళ్ల ధరలు గతేడాదితో పోలిస్తే ఏకంగా 11శాతం పెరిగాయి. గత త్రైమాసికంలో 2 శాతం పెరుగుదల ఉంది. ఆలస్యంతో.. వాయిదాలతో ఇల్లు కొనుగోలు భారమవుతుంది. గత మూడు నెలల్లో హైదరాబాద్ లో 7900 ఇళ్లను విక్రయిస్తే.. 50 లక్షల లోపు ఇళ్లవాటా తక్కువగా ఉంది. అత్యల్పంగా 749 ఇళ్ల విక్రయాలే జరిగాయి. ఈ ధరలకు ఇళ్లే దొరకడం లేదు. 50 లక్షలు నుంచి కోటి రూపాయల లోపు 3247 ఉన్న కోటిపైన ధర పలికే ఇళ్లు 4329 విక్రయం జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. ఈ స్థాయిలో ధరలు ఉండటంతో మళ్లీ పెరగకముందే స్థిరాస్తిని కొనుగోలు చేయడం మేలని పరిశ్రమ పెద్దలు సూచిస్తున్నారు. ఐటీ కారిడార్గ తో పాటు గచ్చిబౌలి చుట్టుపక్కలతో పాటూ ఎల్బీనగర్, ఉప్పల్, కొంపల్లి, శంషాబాద్, పటాన్చెరు వైపు అందుబాటులో ఉన్నాయి..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..