- Telugu News Photo Gallery Sowa Fish: Know more about fish that made Pak fishermen millionaires Telugu News
Sowa Fish: జాలరి వలకు చిక్కిన బంగారు చేపలు.. వేలంలో ఒక్కో ఫిష్ ఖరీదు రూ.70లక్షలు..
సోవా ఫిష్‌గా ప్రసిద్ధి చెందిన ఈ అరుదైన ఔషధ గుణాలున్న చేపలు పెద్ద మొత్తంలో అతని వలకు చిక్కాయి. శుక్రవారం కరాచీ హార్బర్‌లో 70 మిలియన్ల పాకిస్థానీ రూపాయలకు అతడు సోవా చేపల్ని విక్రయించాడు. ఇది చాలా అరుదుగా మార్కెట్లో లభ్యమవుతుంది. కాబట్టి దీని విలువ లక్షలు కోట్లల్లోనే ఉంటుంది. సోవా అనేది సముద్రంలో లభించే ఒకరకమైన చేప. దాంతో అతడు రాత్రికి రాత్రే మత్స్యకారుల విధిని మార్చిన ఈ బంగారు రంగు చేప గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Nov 19, 2023 | 11:35 AM

ఒక విచిత్రమైన సంఘటనతో హాజీ బలోచ్ అనే పాకిస్తానీ మత్స్యకారుడు తన జీవితంలో ఊహించలేని, నమ్మశక్యం కాని మార్పుకు సాక్షంగా నిలిచాడు. అతని వలకు అరుదైన చేపలు చిక్కుకోవడంతో అతడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. అరేబియా సముద్రం నుంచి పట్టిన ఈ చేపలు మత్స్యకారుల జీవితాన్నే మార్చేసింది. ఈ చేపలను వేలం వేసి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. వేలంలో ఒక్కో చేప ధర రూ.70 లక్షలు పలికిందని తెలిసింది.

20 నుండి 40 కిలోగ్రాముల బరువుంటుంది. 1.5 మీటర్ల వరకు పెరిగే సామర్థ్యం కలిగిన సోవా చేపకు తూర్పు ఆసియా దేశాలలో భారీ డిమాండ్ ఉంటుంది. దాని ప్రత్యేక లక్షణాలు, ఔషధ విలువల కారణంగా మార్కెట్‌లో విలువ కూడా అదే స్థాయిలో ఉంటుంది.

ఇది చాలా అరుదుగా మార్కెట్లో లభ్యమవుతుంది. కాబట్టి దీని విలువ లక్షలు కోట్లల్లోనే ఉంటుంది. సోవా అనేది సముద్రంలో లభించే ఒకరకమైన చేప. ఇది సముద్రతీర జలాల్లో ఎక్కువ కనిపిస్తుంది. ఈ చేప సంతానోత్పత్తి కాలంలో మాత్రమే తీరానికి దగ్గరగా వస్తుంది.

తూర్పు అట్లాంటిక్ మహాసముద్రం, అలాగే మధ్యధరా, నల్ల సముద్రాలకు చెందినది. ఈ బంగారు రంగు చేపలు పెద్ద శరీరాన్ని కలిగి ఉంటాయి. ముత్యాల-వెండి నుండి గోధుమ రంగు వరకు అందమైన, ఆకర్షణీయమైన రంగుల్లో ఉంటాయి. ఈ పెద్ద చేప నోరు పసుపు రంగులో ఉంటుంది. ఈ చేపలు వసంత ఋతువు, వేసవి కాలంలో జతకట్టడానికి సముద్ర తీర జలాలను ఆశ్రయిస్తుంటాయి.

ఈ బంగారు రంగు చేప అమూల్యమైనది, అరుదైనదిగా చెబుతారు. ఎందుకంటే దాని బొడ్డులో కనిపించే పదార్ధం వైద్యంలో అత్యంత కీలకం. ఎన్నో ఔషధ విలువను కలిగి ఉంటుంది. దాని శరీరంలో కనిపించే సన్నని దారం లాంటి నిర్మాణాన్ని శస్త్రచికిత్సా విధానాలలో కూడా ఉపయోగిస్తారు. మార్కెట్‌లో అరుదుగా లభించే చేప కావటంతో దీన్ని కోట్లు పెట్టి మరీ కొనుగోలు చేస్తుంటారు.

దాని ఔషధ విలువతో పాటు, సోవా చేప సాంస్కృతిక, సాంప్రదాయిక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. ముఖ్యంగా స్థానిక పాక పద్ధతులు, సాంప్రదాయ ఔషధాలలో దీనిని విరివిగా ఉపయోగిస్తారు. ఇలాంటి అరుదైన,ఖరీదైన చేపలు తమ వలలో చిక్కటంతో జాలర్లు పండగ చేసుకున్నారు.
