IVPL 2024: ‘యూనివర్సల్ బాస్’ వచ్చేశాడు.. తెలంగాణ టైగర్స్ సారథిగా బరిలోకి.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
Indian Veteran Premier League: మార్చి 1న రెడ్ కార్పెట్ ఢిల్లీ, తెలంగాణ టైగర్స్ మధ్య మ్యాచ్ అనంతరం లీగ్ దశ ముగుస్తుంది. ఈ లీగ్‌లో మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి జరుగుతాయి. రెండో మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మార్చి 3న IVPL ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నాకౌట్ మ్యాచ్‌లకు ముందు ప్రతిరోజూ డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉంటాయి.

Indian Veteran Premier League: ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL 2024) మొదటి సీజన్ కోసం వెస్టిండీస్ (West Indies) లెజెండరీ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ (Chris Gayle)ఆదివారం గ్రేటర్ నోయిడా చేరుకున్నాడు. అతను సోమవారం షాహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగే బిగ్ మ్యాచ్‌లో జట్టుతో చేరనున్నాడు. క్రిస్ గేల్ తెలంగాణ టైగర్స్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆయన నోయిడా రాక అభిమానుల్లో ఉత్కంఠను పెంచింది. గ్రేటర్ నోయిడాలో తమ అభిమాన ఆటగాడి పవర్ హిట్టింగ్ చూసేందుకు అభిమానులంతా సిద్ధంగా ఉన్నారు.
BVCI యాక్టింగ్ ప్రెసిడెంట్, IVPL చైర్మన్ ప్రవీణ్ త్యాగి మాట్లాడుతూ, “గ్రేటర్ నోయిడాకు క్రిస్ గేల్‌ను స్వాగతిస్తున్నందుకు మేం చాలా సంతోషంగా ఉన్నాం. అతని ఉనికి ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్‌కి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అతనిని చూడటానికి మేం ఎదురుచూస్తున్నాం. పవర్ హిట్టింగ్ కోసం ఆత్రుతగా వేచి ఉన్నాం” అంటూ చెప్పుకొచ్చాడు.
సోమవారం వివిఐపి ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ తన టీమ్ తెలంగాణ టైగర్స్ కోసం ఆడనున్నాడు. బోర్డ్ ఫర్ వెటరన్ క్రికెట్ ఇన్ ఇండియా (BVCI) ఈ లీగ్‌ని నిర్వహిస్తోంది. ఈ లీగ్‌లోని అన్ని మ్యాచ్‌లు గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పతిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్నాయి. ఇందులో సురేష్ రైనా, హర్షల్ గిబ్స్, మునాఫ్ పటేల్ వంటి వెటరన్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు.
View this post on Instagram
మార్చి 1న రెడ్ కార్పెట్ ఢిల్లీ, తెలంగాణ టైగర్స్ మధ్య మ్యాచ్ అనంతరం లీగ్ దశ ముగుస్తుంది. ఈ లీగ్‌లో మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి జరుగుతాయి. రెండో మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మార్చి 3న IVPL ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నాకౌట్ మ్యాచ్‌లకు ముందు ప్రతిరోజూ డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉంటాయి.
టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన తెలంగాణ టైగర్స్ జట్టు ముంబై ఛాంపియన్స్‌తో ఓడిపోయింది. అయితే ఇప్పుడు క్రిస్ గేల్ రాకతో తమ జట్టు సురేష్ రైనా సారథ్యంలోని జట్టుకు సవాల్ విసిరి సోమవారం విజయం సాధిస్తుందని ఆ జట్టు భావిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




