IND vs ENG LIVE Score, 4th Test: రాంచీ కొరల్లో చిక్కుకున్న భారత్.. 3 వికెట్లు డౌన్.. విజయానికి ఎంత కావాలంటే?
India vs England 4th Test Day 4 Live Score: 5 టెస్టుల సిరీస్‌లో నాలుగో మ్యాచ్ రాంచీలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతోంది. నాలుగో రోజు ఆట మొదలైంది. ప్రస్తుతం టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. 85 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్‌ను జో రూట్ అవుట్ చేశాడు. ఆ తర్వాత, రోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్‌లో 17వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. 69 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. హాఫ్ సెంచరీ తర్వా రోహిత్ (55) హార్ట్‌లీ బౌలింగ్‌లో స్టంప్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత యంగ్ ప్లేయర్ రజత్ పాటిదార్ (0) మరోసారి తీవ్రంగా నిరాశ పరిచాడు.

ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్, జడేజా ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 86 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సిరీస్‌లో 3-1తో తిరుగులేని ఆధిక్యం సాధిస్తుంది.
అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 145 పరుగులకు ఆలౌట్ చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. ధృవ్ జురెల్ (90) ధీటైన ఇన్నింగ్స్‌తో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులు చేసింది. ఈ విధంగా ఇంగ్లండ్‌కు 46 పరుగుల ఆధిక్యం లభించగా, మొత్తం ఆధిక్యం 191 పరుగులు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ తరపున అత్యంత విజయవంతమైన బౌలర్‌గా ఆర్ అశ్విన్ నిలిచాడు. ఐదు వికెట్లు తీశాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ ఖాతాలో 4 వికెట్లు ఉన్నాయి.
100 up in the chase for #TeamIndia! 👍
Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9 #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/tsszkvePOC
— BCCI (@BCCI) February 26, 2024
రెండు జట్ల ప్లేయింగ్ 11..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రజత్ పాటిదార్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్.
ఇంగ్లండ్: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రౌలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్, షోయబ్ బషీర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..