SRH Vs LSG: అందరూ భల్లాలదేవుడి బ్రదర్సే.. భయంలో పంత్.. లక్నో ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
ఐపీఎల్ 2025లో 7వ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. హైదరాబాద్ తొలి మ్యాచ్‌లో గెలవగా.. లక్నో ఓటమిపాలైంది. పంత్ నాయకత్వంలోని లక్నో జట్టు.. హెడ్-అభిషేక్ శర్మ తుఫాన్ నుంచి బయటపడగలదా.? ఈ స్టోరీలో చూసేయండి. ఓ సారి లుక్కేయండి.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పాలైంది. ఇక ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రెండో మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. ఐపీఎల్ 2025లో ఏడో మ్యాచ్ గురువారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా హైదరాబాద్, లక్నో మధ్య జరగనుంది. గత ఏడాది రన్నరప్ అయిన SRH తన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను 44 పరుగుల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో పాట్ కమ్మిన్స్ నాయకత్వంలోని హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
ఇది చదవండి: దేవుడు కలలో కనిపించి పొలంలో తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా
SRH బ్యాటింగ్ లైనప్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ప్రత్యర్ధులకు కచ్చితంగా వణుకు పుట్టాల్సిందే. గత మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 47 బంతుల్లో అజేయంగా 107 పరుగులు చేయగా.. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ లాంటి బ్యాటర్లు తమ హిట్టింగ్‌తో బెంబేలెత్తించారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా RRపై 200+ స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. SRH బ్యాటింగ్ ఫుల్ స్ట్రాంగ్‌గా ఉంది. ఇక ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు మొదటి 5 మ్యాచ్‌ల్లో 119 సిక్సర్లు నమోదు కాగా.. ఇదొక కొత్త రికార్డు.
పంత్ తప్పులను సరిదిద్దుకుంటాడా.?
DC చేతిలో LSG 1 వికెట్ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ 6 బంతుల్లో 0 పరుగులు చేసి.. చివరి ఓవర్‌లో స్టంపింగ్ మిస్ అయ్యాడు. LSG బౌలింగ్ కూడా బలహీనంగా కనిపిస్తోంది. రవి బిష్ణోయ్, మణిమారన్ సిద్ధార్థ్, దిగ్వేష్ రాఠి బౌలింగ్‌లో తేలిపోయారు. ఇక గతంలో ఇదే ఉప్పల్ స్టేడియంలో తొమ్మిది ఓవర్లలోనే లక్నో జట్టును చిత్తు చేసింది SRH. అప్పుడు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించారు.
ఇది చదవండి: పెళ్లి, ఆపై ఫస్ట్‌నైట్.. మూడో రోజే వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. అతడేం చేశాడంటే
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI:
ఇషాన్ కిషన్ (wk), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ఆడమ్ జంపా, పాట్ కమ్మిన్స్ (c), భువనేశ్వర్ కుమార్, తన్వీర్ సంఘ, రాహుల్ చాహర్, జయదేవ్ ఉనద్కట్.
లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI:
క్వింటన్ డి కాక్, ఐడెన్ మార్క్రమ్, రిషబ్ పంత్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్, శార్దూల్ ఠాకూర్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, మయాంక్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్.
ఇది చదవండి: కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. ఆపి చెక్ చేయగా
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి