AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni Viral Video: CSK ప్రాక్టీస్ వదిలి సైనికుల మధ్యకు చేరుకున్న ధోనీ.. వీడియో వైరల్

మహేంద్ర సింగ్ ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ ఎప్పుడూ బిజిబిజిగా ఉంటాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో CSK తరపున ఆడుతున్న ఎంఎస్ ధోని మరింత బిజీగా మారాడు. అయితే ధోనీ దృష్టిలో దేశ సేవ కంటే మరేదీ ముఖ్యం కాదని తెలియజేసే ఒక సంఘటన తాజాగా చోటు చేసుకుంది. దేశ భద్రలో నిమగ్నమైన భద్రతా సిబ్బందిని కలిసే విషయానికి వస్తే.. ధోని అన్నింటినీ వదిలి అక్కడికి చేరుకుంటాడు.. ఎందుకంటే అది ధోనికి దేశం పట్ల ఉన్న ప్రేమ.. సైన్యం పట్ల ఉన్న అనుబంధం.

MS Dhoni Viral Video: CSK ప్రాక్టీస్ వదిలి సైనికుల మధ్యకు చేరుకున్న ధోనీ.. వీడియో వైరల్
Ms Dhoni
Follow us
Surya Kala

|

Updated on: Mar 27, 2025 | 11:06 AM

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వివిధ రకాల పనులతో బిజీగా ఉంటూనే ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూనే ఉన్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా.. ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ కొనసాగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న ధోనీ ఈ ఐపీఎల్ లో ప్రాక్టిస్ తో బిజిబిజిగా గడుపుతున్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ , లెజెండరీ వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్ ఎంఎస్ ధోని ప్రస్తుతం చెన్నైలో ఉన్నారు. CSK జట్టు తన నెక్స్ట్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎదుర్కోవలసి ఉంది. అటువంటి పరిస్థితిలో చెన్నై ఆటగాళ్ళు ఈ మ్యాచ్ కోసం సిద్ధం కావడానికి తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. అయితే ధోనీకి CISF కార్యక్రమానికి ఆహ్వానం అందింది. వెంటనే ధోని తన బిజీ ప్రాక్టీస్ సెషన్‌ను వదిలి ఆ కార్యక్రమానికి బయలుదేరాడు.

ప్రాక్టీస్ డ్రెస్‌లో సైనికుల మధ్యకు చేరుకున్న ధోనీ

చెన్నైలో జరిగిన ఈ ఈవెంట్ లో ధోనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అందులో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ డ్రెస్‌లో కనిపిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో పాల్గొనమని CISF నుంచి అతనికి ఆహ్వానం వచ్చినప్పుడు, IPL బిజీ షెడ్యూల్ మధ్య తాను వీలైనంత ఎక్కువ సమయం ఈ కార్యక్రమం కోసం కేటాయిస్తానని.. ఖచ్చితంగా ఇందులో పాల్గొంటానని ధోని చెప్పాడట. సమయం దొరికిన వెంటనే ప్రాక్టీస్ డ్రెస్‌లోనే ఈ ఈవెంట్‌కు చేరుకున్నానని ధోని చెప్పాడు. ధోనికి సంబంధించిన ఈ వీడియోను అభిమానులు చాలా ఇష్టపడుతున్నారు.

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

ధోనిపై అభిమానుల చూపు

ఈ ఐపీఎల్ సీజన్ విషయానికొస్తే చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభాన్ని చేసింది. చెన్నై తన తొలి మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ అతనికి 2 బంతులు మాత్రమే ఆడే అవకాశం లభించింది. అప్పటికే చెన్నై విజయం ఖాయం అయింది. అటువంటి పరిస్థితిలో ధోనీ రానున్న మ్యాచ్ లో బ్యాట్‌తో ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చూడటానికి అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ధోని తన వికెట్ కీపింగ్ తో ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించాడు. మరోసారి.. ఇది ధోని చివరి సీజన్‌గా పరిగణించబడుతోంది. దీంతో ధోనీ మైదానంలో ఉండే ప్రతి క్షణాన్ని చూసి ఆనందించాలనుకుంటున్నారు ఫ్యాన్స్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..