- Telugu News Photo Gallery Cricket photos These 4 Players Took Revenge On Their Old Teams Who Released In IPL 2025 Mega Auction
IPL 2025: కసి తీర్చుకున్నారుగా.! పాత జట్టును ఉతికారేసిన ఆ 4గురు ప్లేయర్లు.. ఎవరంటే.?
బ్యాటింగ్ కు పనికిరారని.. ఈ ప్లేయర్స్ ని వదిలేసింది పాత ఫ్రాంచైజీ. తీరా ఇప్పుడు ఈ ఐపీఎల్ 2025లో తమ పాత జట్లను ఉతికి ఆరేశారు ఈ నలుగురు ప్లేయర్స్. అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. మరి వారెవరంటే.. ఆ వివరాలు..
Updated on: Mar 27, 2025 | 1:57 PM

ఐపీఎల్ 2025లో ఇప్పటిదాకా ఆరు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. గురువారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇదిలా ఉంటే.. ముందు మ్యాచ్‌లలో ఓ నలుగురు ప్లేయర్స్ తమ పాత జట్లపై అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి కసి తీర్చుకున్నారు. వారెవరంటే..

ఫిల్ సాల్ట్.. కోల్‌కతా నైట్ రైడర్స్ టీం ఈ రైట్ హ్యాండ్ ప్లేయర్‌ను ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు విడుదల చేసింది. ఇక ఆ కసిని మొదటి మ్యాచ్‌లో తీర్చుకున్నాడు ఫిల్ సాల్ట్. రాయల్ ఛాలెంజర్స్ తరపున ఆడుతున్న సాల్ట్.. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 56 పరుగులు చేశాడు.

మిచెల్ మార్ష్.. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఆటగాడిని వదులుకోగా.. మనోడు ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక లక్నో, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్‌లో మార్ష్ 36 బంతుల్లో 72 పరుగులు చేసి అదరగొట్టాడు.

శార్దూల్ ఠాకూర్.. ఈ రైట్ ఆర్మ్ ఆల్‌రౌండర్.. ఇదివరకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించగా.. అతడ్ని ఆ ఫ్రాంచైజీ వదులుకుంది. ఇక ఈ ఐపీఎల్‌లోనే ఢిల్లీపై చక్కటి ప్రదర్శన కనబరిచి.. లక్నోకు కీలక వికెట్లు అందించడంలో సహాయపడ్డాడు ఠాకూర్.

షారుఖ్ ఖాన్.. ఈ వికెట్ కీపర్, బ్యాటర్ కూడా తన పాత జట్టు పంజాబ్ కింగ్స్‌పై అద్భుత ప్రదర్శన చేయాలనుకోగా.. ఓవర్స్ పూర్తి కావడంతో ఆ ఛాన్స్ కుదరలేదు.





























