IPL 2024: టాప్ 4కి దడ పుట్టిస్తోన్న బెంగళూరు.. రసవత్తరంగా ప్లేఆఫ్ రేసు.. పర్పుల్, ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో మనోళ్లే..

IPL 2024: ఐపీఎల్ 2024 (IPL 2024) 52వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది. ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు తీయడం ద్వారా ఆర్‌సీబీపై గుజరాత్ ఆధిపత్యం చెలాయించినప్పటికీ, ఎట్టకేలకు బెంగళూరు 14వ ఓవర్‌లో విజయాన్ని నమోదు చేసుకోగలిగింది.

IPL 2024: టాప్ 4కి దడ పుట్టిస్తోన్న బెంగళూరు.. రసవత్తరంగా ప్లేఆఫ్ రేసు.. పర్పుల్, ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో మనోళ్లే..
Rcb records
Follow us

|

Updated on: May 05, 2024 | 7:38 AM

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 (IPL 2024) 52వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది. ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు తీయడం ద్వారా ఆర్‌సీబీపై గుజరాత్ ఆధిపత్యం చెలాయించినప్పటికీ, ఎట్టకేలకు బెంగళూరు 14వ ఓవర్‌లో విజయాన్ని నమోదు చేసుకోగలిగింది.

ప్రస్తుత సీజన్‌లో ఆర్‌సీబీకి ఇది నాలుగో విజయం కాగా ఇప్పుడు ఎనిమిది పాయింట్లతో పదో స్థానం నుంచి ఏడో స్థానానికి చేరుకుంది. అదే సమయంలో గుజరాత్ జట్టు 8వ స్థానం నుంచి 9వ స్థానానికి దిగజారింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ చివరి స్థానంలో ఉంది.

ఈ మ్యాచ్‌లో RCB వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 42 పరుగులు చేశాడు. అతను మరోసారి ఆరెంజ్ క్యాప్ కోసం పోటీలో మొదటి స్థానంలో నిలిచాడు. పర్పుల్ క్యాప్ ఇప్పటికీ జస్ప్రీత్ బుమ్రా ఆధీనంలోనే ఉంది.

ఇవి కూడా చదవండి

IPL 2024 పాయింట్ల పట్టిక ఎలా ఉందంటే?

1) రాజస్థాన్ రాయల్స్ – 10 మ్యాచ్‌ల తర్వాత 16 పాయింట్లు

2) కోల్‌కతా నైట్ రైడర్స్ – 10 మ్యాచ్‌ల తర్వాత 14 పాయింట్లు

3) లక్నో సూపర్‌జెయింట్స్ – 10 మ్యాచ్‌ల తర్వాత 12 పాయింట్లు

4) సన్‌రైజర్స్ హైదరాబాద్ – 10 మ్యాచ్‌ల తర్వాత 12 పాయింట్లు

5) చెన్నై సూపర్ కింగ్స్ – 10 మ్యాచ్‌ల తర్వాత 10 పాయింట్లు

6) ఢిల్లీ క్యాపిటల్స్ – 11 మ్యాచ్‌ల తర్వాత 10 పాయింట్లు.

7) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 11 మ్యాచ్‌ల తర్వాత 8 పాయింట్లు

8) పంజాబ్ కింగ్స్ – 10 మ్యాచ్‌ల తర్వాత 8 పాయింట్లు

9) గుజరాత్ టైటాన్స్ – 11 మ్యాచ్‌ల తర్వాత 8 పాయింట్లు

10) ముంబై ఇండియన్స్ – 11 మ్యాచ్‌ల తర్వాత 6 పాయింట్లు

IPL 2024లో అత్యధిక పరుగులు చేసిన ముగ్గురు బ్యాట్స్‌మెన్స్?

1- విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): 11 మ్యాచ్‌ల తర్వాత 542 పరుగులు

2- రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్): 10 మ్యాచ్‌ల తర్వాత 509 పరుగులు

3- సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్): 10 మ్యాచ్‌ల తర్వాత 424 పరుగులు

ఐపీఎల్ 2024లో అత్యధిక వికెట్లు తీసిన ముగ్గురు బౌలర్లు?

1- జస్ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్): 11 మ్యాచ్‌ల తర్వాత 17 వికెట్లు

2- టి. నటరాజన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్): 8 మ్యాచ్‌ల తర్వాత 15 వికెట్లు

3- ముస్తాఫిజుర్ రెహ్మాన్ (చెన్నై సూపర్ కింగ్స్): 9 మ్యాచ్‌ల తర్వాత 14 వికెట్లు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..