LSG Vs MI, IPL 2024: ముంబై మళ్లీ తడ ‘బ్యాటు’.. లక్నో టార్గెట్ ఎంతంటే?

డూ ఆర్ డై మ్యాచ్ లో ముంబై నామ మాత్రపు స్కోరుకే పరిమితమైంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు కు లక్నో బౌలర్లు చుక్కలు చూపించారు. వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో పాటు పరుగులు రాకుండా కట్టడి చేశారు. ఫలితంగా ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి  కేవలం

LSG Vs MI, IPL 2024: ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
Lucknow Super Giants vs Mumbai Indians
Follow us

|

Updated on: Apr 30, 2024 | 9:54 PM

Lucknow Super Giants vs Mumbai Indians: ముంబై ఇండియన్స్ బ్యాటర్లు మళ్లీ తడబడ్డారు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో సమష్ఠిగా విఫలమయ్యారు. ఫలితంగా డూ ఆర్ డై మ్యాచ్ లో ముంబై నామ మాత్రపు స్కోరుకే పరిమితమైంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు కు లక్నో బౌలర్లు చుక్కలు చూపించారు. వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో పాటు పరుగులు రాకుండా కట్టడి చేశారు. ఫలితంగా ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి  కేవలం 144 పరుగులు మాత్రమే చేసింది. నేహాల్‌ (41 బంతుల్లో 46, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్‌ డేవిడ్‌ ( 18 బంతుల్లో 35 నాటౌట్, 3 ఫోర్లు, ఒక సిక్సర్) మాత్రమే ఓ మోస్తరుగా రాణించారు. ఓపెనర్ ఇషాన్‌ కిషన్ (32) ఫర్వాలేదనిపించాడు. బర్త్ డే బాయ్ రోహిత్ శర్మ‌ (4), తిలక్‌ వర్మ (7), సూర్య కుమార్ యాదవ్ (10), హార్దిక్ పాండ్యా‌ (0), నబీ (1) పూర్తిగా నిరాశపరిచారు. లక్నో బౌలర్లలో మోసిన్‌ 2 వికెట్లు పడగొట్టగా.. స్టాయినిస్‌, నవీనుల్‌, మయాంక్‌, బిష్ణోయ్‌ తలో వికెట్‌ తీశారు.

రాణించిన మోహసిన్ ఖాన్..

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):

ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కొట్జియా, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

నువాన్ తుషార, కుమార్ కార్తికేయ, డెవాల్డ్ బ్రీవిస్, నమన్ ధీర్, షామ్స్ ములానీ

లక్నో సూపర్‌జెయింట్స్ (ప్లేయింగ్ ఎలెవన్):

కేఎల్ రాహుల్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బదోనీ, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

అర్షిన్ కులకర్ణి, మణిమారన్ సిద్ధార్థ్, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్

ఆదుకున్న నేహాల్ వదేరా…

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..