IPL 2024: 42 ఏళ్ల వయసులోనూ సింగిల్ హ్యాండ్ సిక్స్.. హెలికాప్టర్ షాట్స్.. ధోని ధనాధన్ బ్యాటింగ్.. వీడియో
ఐపీఎల్ 2024 ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మార్చి 22న చెపాక్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇందు కోసం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని బాగానే సన్నద్ధమవుతున్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ కోసం సన్నద్ధమవుతున్నాడు. అందుకు తగ్గట్టే ప్రాక్టీస్ సెషన్‌లోనూ బాగా కష్టపడుతున్నాడు. ధోని నెట్ సెషన్‌లను పరిశీలిస్తే, అతను 42 ఏళ్ల వయస్సులో కూడా ఎంత ఫిట్‌గా ఉన్నాడో తెలుస్తుంది. ఐపీఎల్ ధనాధన్ ధోని బ్యాటింగ్‌ను చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఐపీఎల్ 2024 ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మార్చి 22న చెపాక్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ప్రస్తుతం ఎంఎస్ ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. CSK నెట్ ప్రాక్టీస్ సెషన్స్‌లో ధోనీ బాగా శ్రమిస్తున్నాడు. కఠినమైన బౌలింగ్‌లో సులభంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. తనకు మాత్రమే సాధ్యమయ్యే హెలికాప్టర్ షాట్, ఒంటిచేత్తో సిక్సర్ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. కాగా ధోని తన ట్రేడ్‌మార్క్ హెలికాప్టర్ షాట్ కొట్టడంతో CSK టీమ్ సభ్యులు ఆశ్చర్యపోయారు. మొత్తానికి ధోనీ బ్యాటింగ్ ప్రదర్శన అటు సీఎస్‌కే టీమ్ లోనూ, చెన్నై అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.
గతేడాది ముంబైలో ధోనీకి మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. దీనికి తోడు ఇదే ధోనికి ఆఖరి ఐపీఎల్ సీజన్ అని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన ధనాధన్ బ్యాటింగ్ ను మరోసారి రుచి చూపించాలనుకుంటున్నాడు ధోని. తన జట్టుకు ఆరో ఐపీఎల్ టైటిల్ సాధించి పెట్టానలి కృతనిశ్చయంతో ఉన్నాడు. మరోవైపు “ధోని మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు” అని CSK CEO కాశీ విశ్వనాథన్ చిట్ చాట్ లో తెలిపారు.
ధోని ధనాధన్ బ్యాటింగ్ వీడియోలు.. ఇదిగో..
MS Dhoni hitting 6’s with 1 hand 🫢🫢#MSDhoni𓃵 pic.twitter.com/SDhk6i3ly4
— ICT Fan (@Delphy06) March 16, 2024
Thala Dhoni Smashes a Biggie During Open Nets Session in Chepauk Stadium !! 🔥🥶#MSDhoni | #WhistlePodu | #IPL2024 | #CSK 🎥 via Naveen pic.twitter.com/9HAwE8maAj
— TEAM MS DHONI #Dhoni (@imDhoni_fc) March 16, 2024
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు:
ఎంఎస్ ధోని (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్‌గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, మతిష్ పతిరణ, అజింక్యా రహాన్, అజింక్యా , ఎం. , నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేష్ తీక్షన్, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అవనీష్ రావు, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, అవనీష్ రావు ఆరవెల్లి.
Thalaivan is cooking big this time!🥶#MSDhonipic.twitter.com/RagFycJqvA
— Hustler (@HustlerCSK) March 15, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








