- Telugu News Photo Gallery Cricket photos We Need Virat Kohli At Any Cost For T20 World Cup 2024 says Rohit Sharma
T20 World Cup 2024: ఆరు నూరైనా కోహ్లీ ఉండాల్సిందే.. తేల్చి చెప్పేసిన రోహిత్..
T20 World Cup 2024: ఈసారి వెస్టిండీస్-USAలో జరిగే T20 ప్రపంచ కప్ జూన్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఫైనల్ మ్యాచ్ జూన్ 29 న బార్బడోస్‌లో జరుగుతుంది. ఈ టోర్నీకి ఎంపికయ్యే భారత జట్టులో విరాట్ కోహ్లీకి స్థానం కల్పించాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూచించినట్లు తెలుస్తోంది.
Updated on: Mar 17, 2024 | 3:48 PM

జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) జట్టులో విరాట్ కోహ్లీకి చోటు కల్పించాలని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బీసీసీఐకి సూచించాడు. నివేదిక ప్రకారం, రోహిత్ శర్మ బీసీసీఐ సెక్రటరీ జే షాతో దీనిపై చర్చించాడంట. హిట్‌మ్యాన్ తన స్టాండ్‌ను స్పష్టం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

టీ20 ప్రపంచకప్‌నకు ఎంపిక చేసే జట్టులో విరాట్ కోహ్లీకి చోటు కల్పించడం లేదని గతంలో వార్తలు వచ్చాయి. ఈ ప్రపంచకప్ జరిగే వెస్టిండీస్‌లో కోహ్లి బ్యాటింగ్‌కు సరిపోని స్లో పిచ్‌లు ఉన్నాయి. అందుకే కోహ్లీని ఒప్పించి యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ సెక్రటరీ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్‌కు సూచించినట్లు సమాచారం.

కానీ, కింగ్ కోహ్లిని ఒప్పించడంలో అజిత్ అగార్కర్ విఫలమయ్యాడని సమాచారం. అందుకే జై షా ఈ బాధ్యతను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అప్పగించినట్లు భారత జట్టు మాజీ ప్లేయర్ కీర్తి ఆజాద్ తెలిపారు.

అయితే విరాట్ కోహ్లీని జట్టు నుంచి తప్పించేందుకు రోహిత్ శర్మ సుతారం సిద్ధంగా లేడు. అందుకే కోహ్లీకి ఎలాగైనా టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానం కల్పించాలని రోహిత్ శర్మ జే షాకు చెప్పాడు. కీర్తి ఆజాద్ ప్రకారం, రాబోయే టీ20 ప్రపంచకప్‌లో కింగ్ కోహ్లీ ఆడటం ఖాయమని తెలుస్తోంది.

జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న పొట్టి క్రికెట్ పోరుకు జట్లను ప్రకటించేందుకు మే 1 చివరి తేదీ. ఇలా మార్చి చివరి నాటికి 20 దేశాలు తమ జట్లను ప్రకటించనున్నాయి. దీనికి ముందు విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్ ఆడతాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుందని సమాచారం.

దీని ప్రకారం, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చివరిసారి ప్రపంచకప్‌లో కలిసి పోటీపడనున్నారు. ఈ ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఇద్దరు దిగ్గజాలు టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది.




