IND vs ENG: లండన్‌కు బయలుదేరిన భారత ఆటగాళ్లు.. ఇంగ్లండ్‌లో టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే..
India vs England: ఒకవైపు రిషబ్ పంత్ సారథ్యంలో యంగ్ టీమిండియా టీ 20 సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో తలపడుతుండగానే మరోవైపు సీనియర్ ఆటగాళ్లు లండన్‌కు పయనమయ్యారు. గురువారం టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, ఛెతేశ్వర్ పుజారా లండన్ బయల్దేరి వెళ్లారు.
India vs England: ఒకవైపు రిషబ్ పంత్ సారథ్యంలో యంగ్ టీమిండియా టీ 20 సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో తలపడుతుండగానే మరోవైపు సీనియర్ ఆటగాళ్లు లండన్‌కు పయనమయ్యారు. గురువారం టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, ఛెతేశ్వర్ పుజారా లండన్ బయల్దేరి వెళ్లారు. కాగా ఇంగ్లండ్ పర్యటనలో (IND vs ENG) గతేడాది అర్ధాంతరంగా వాయిదా పడిన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడనుంది టీమిండియా. జులై 1 న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఈ రీషెడ్యూల్ టెస్ట్ ప్రారంభంకానుంది. మొత్తం 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. దీంతో కనీసం ఈ మ్యాచ్‌ను డ్రాగా ముగించిన అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో మరో అద్భుత విజయం భారత జట్టు ఖాతాలో చేరనుంది. కాగా ఈ మ్యాచ్‌కు ముందు ఎడ్జ్‌బాస్టన్‌లో ఓ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడనుంది టీమిండియా. ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ, కేఎస్ భరత్, హనుమ విహారి కూడా లండన్ విమానం ఎక్కారు. దక్షిణాఫ్రికాతో టీ 20 సిరీస్ ముగిసిన తర్వాత జట్టులోని ఇతర ఆటగాళ్లు, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇంగ్లండ్‌కు బయలుదేరనున్నారు.
సాధారణ విమానాల్లోనే..
కాగా గతంలో కేవలం చార్టర్ విమానాల్లోనే టీమిండియా ఆటగాళ్లు ప్రయాణాలు చేసేవారు. అయితే ప్రస్తుతం బయోబబుల్ నిబంధనలేమీ లేకపోవడంతో సాధారణ విమానాల్లోనే లండన్‌కు బయలుదేరారు భారత ఆటగాళ్లు. అక్కడకు వెళ్లేముందే అందరికీ కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు జరిపారు. కాగా లండన్ చేరుకున్న తర్వాత భారత జట్టు నేరుగా లీసెస్టర్‌కు వెళ్లనున్నారు. కాగా గత ఏడాది భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో మిగిలిన చివరి మ్యాచ్ జూలై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుంది. అంతకు ముందు జూన్ 24 నుంచి లీసెస్టర్‌లో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. అంతకుముందు జూన్ 24, 26 తేదీల్లో ఐర్లాండ్‌తో టీమ్ ఇండియా మరో టీ20 సిరీస్ ఆడనుంది.
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ పూర్తి షెడ్యూల్
* జులై (1-5) – రీ షెడ్యూల్ టెస్ట్- ఎడ్జ్‌బాస్టన్
టీ20 సిరీస్
* జులై 7- మొదటి టీ20 – సౌతాంప్టన్
* జులై 9- రెండో టీ20 – బర్మింగ్‌హామ్
* జూలై 10- మూడో టీ20- నాటింగ్‌హామ్
వన్డే సిరీస్
* జులై 12- మొదటి వన్డే- లండన్
* జులై14- రెండో వన్డే- లార్డ్స్
* జులై 17- మూడో వన్డే- మాంచెస్టర్
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టుకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), KL రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, ఛెతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్, KS భరత్, రవీంద్ర జడేజా, R అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మొహమ్మద్ సిమ్రాజ్, మొహమ్మద్ బుమ్రా ఉమేష్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.
England bound ✈️
? ?: Snapshots as #TeamIndia takes off for England. ? ? pic.twitter.com/Emgehz2hzm
— BCCI (@BCCI) June 16, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..