Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

U19 World Cup 2024 Final: కమాన్‌ టీమిండియా.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ పూర్తి.. భారత జట్టు టార్గెట్‌ ఎంతంటే?

ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో ఇదే అతిపెద్ద స్కోరు కావడం గమనార్హం. టోర్నీ చరిత్రలో భారత్ అత్యంత విజయవంతమైన జట్టు. ఇప్పటి వరకు 5 సార్లు టైటిల్ గెలుచుకుంది. భారత జట్టు 9వ సారి ఫైనల్ మ్యాచ్ ఆడుతుండగా, ఆస్ట్రేలియా 5వ సారి ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది.

U19 World Cup 2024 Final: కమాన్‌ టీమిండియా.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ పూర్తి.. భారత జట్టు టార్గెట్‌ ఎంతంటే?
Team India
Follow us
Basha Shek

|

Updated on: Feb 11, 2024 | 5:33 PM

అండర్-19 ప్రపంచకప్ 2024 హోరాహోరీగా జరుగుతోంది. బెనోనిలో జరుగుతున్న ఫైనల్లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ జట్టు 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. కెప్టెన్ హ్యూ వైబ్‌జెన్ కూడా 48 పరుగులు చేశాడు. విబ్జెన్‌ 48, డిక్సన్‌ 42, ఓలీవర్‌ ఫికే 46 (నాటౌట్‌) గా నిలిచారు. భారత్ తరఫున రాజ్ లింబానీ అత్యధికంగా 3 వికెట్లు తీయగా, నమన్ తివారీ కూడా 2 వికెట్లు తీశాడు. ఆరోసారి ప్రపంచకప్‌ టైటిల్ గెలవాలంటే టీమ్ ఇండియా 254 పరుగులు చేయాల్సి ఉంది. కాగా ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో ఇదే అతిపెద్ద స్కోరు కావడం గమనార్హం. టోర్నీ చరిత్రలో భారత్ అత్యంత విజయవంతమైన జట్టు. ఇప్పటి వరకు 5 సార్లు టైటిల్ గెలుచుకుంది. భారత జట్టు 9వ సారి ఫైనల్ మ్యాచ్ ఆడుతుండగా, ఆస్ట్రేలియా 5వ సారి ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది. ఆస్ట్రేలియాకు ఓపెనర్‌కు వచ్చిన హ్యారీ డిక్సన్, శామ్ కొన్‌స్టాస్ శుభారంభం అందించారు. కంగారూ జట్టులో హ్యారీ డిక్సన్ 42 పరుగులు, సామ్ కొన్‌స్టాస్ 0 పరుగులు, హ్యూ వెబ్జే 48 పరుగులు, హర్జాస్ సింగ్ 55 పరుగులు, ర్యాన్ హిక్స్ 20 పరుగులు, ఓలీ పీక్ 46 పరుగులు, రాఫెల్ మెక్‌మిలన్ 2 పరుగులు, చార్లీ అండర్సన్ 13 పరుగులు, టామ్ 8 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు, 17 ఫోర్లు, 19 అదనపు పరుగులు వచ్చాయి.

టీమిండియా తరఫున కుచ్చిమడు రాజ్ లింబానీ 10 ఓవర్లలో 38 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మొత్తం టోర్నీలో ఇప్పటివరకు 11 వికెట్లు తీశాడీ స్టార్‌ బౌలర్‌. నమన్ తివారీ 9 ఓవర్లలో 63 పరుగులిచ్చి 2 వికెట్లు, సౌమ్య పాండే 10 ఓవర్లలో 41 పరుగులిచ్చి 1 వికెట్, ముషీర్ ఖాన్ 9 ఓవర్లలో 46 పరుగులిచ్చి 1 వికెట్ తీశారు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 254 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదిస్తే.. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో ఫైనల్‌లో 500కు పైగా పరుగులు నమోదు కావడం ఇదే తొలిసారి అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియా U19 (ప్లేయింగ్ XI): హ్యారీ డిక్సన్, సామ్ కొన్‌స్టాస్, హ్యూ వీబ్‌జెన్(కెప్టెన్), హర్జాస్ సింగ్, ర్యాన్ హిక్స్(కీపర్), ఆలివర్ పీక్, రాఫ్ మాక్‌మిల్లన్, చార్లీ ఆండర్సన్, టామ్ స్ట్రాకర్, మహ్లీ బార్డ్‌మాన్, కల్లమ్ విడ్లర్.

ఇండియా U19 (ప్లేయింగ్ XI): ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్(కెప్టెన్), ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, ఆరవెల్లి అవనీష్(కీపర్), మురుగన్ అభిషేక్, రాజ్ లింబానీ, నమన్ తివారీ, సౌమీ పాండే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..