U19 World Cup 2024 Final: అప్పుడు కూడా సేమ్ టు సేమ్ ఇలాగే.. భారత్‌తే ప్రపంచ కప్ అంటోన్న ఫ్యాన్స్
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ హోరాహోరీగా జరుగుతోంది. ఆస్ట్రేలియా, భారత్ జట్లు పోటాపోటీగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ధాటిగా బ్యాటింగ్ చేస్తోంది. అదే సమయంలో టీమిండియా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తున్నారు. ఇదిలా ఉంటే అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో భారత్, ఆస్ట్రేలియా తలపడడం ఇది మూడోసారి

అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ హోరాహోరీగా జరుగుతోంది. ఆస్ట్రేలియా, భారత్ జట్లు పోటాపోటీగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ధాటిగా బ్యాటింగ్ చేస్తోంది. అదే సమయంలో టీమిండియా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తున్నారు. ఇదిలా ఉంటే అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో భారత్, ఆస్ట్రేలియా తలపడడం ఇది మూడోసారి. అంతకుముందు 2012, 2018లో ఇరు జట్లు ఫైనల్‌లో తలపడ్డాయి. ఈ రెండు ఫైనల్స్‌లోనూ భారత్ విజయం సాధించింది. కాకతాళీయంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ తొలుత బ్యాటింగ్ చేసింది. కానీ మ్యాచ్ గెలవలేకపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా ఓడిపోతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. 2012లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత జట్టు కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ 111 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో టీమిండియాను ఛాంపియన్‌గా నిలబెట్టాడు.ఈ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఆ తర్వాత 2018లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు 217 పరుగుల లక్ష్యాన్ని అందించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన భారత్ 38.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి చాంపియన్‌గా నిలిచింది. మంజోత్ కల్రా జట్టు 101 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. మరి ఈ సారి కూడా అదే సీన్ రిపీట్ అవ్వాలని, భారత్ జగజ్జేతగా నిలవాలని అందరూ కోరుకుంటున్నారు.
ఆస్ట్రేలియా U19 (ప్లేయింగ్ XI): హ్యారీ డిక్సన్, సామ్ కొన్‌స్టాస్, హ్యూ వీబ్‌జెన్(కెప్టెన్), హర్జాస్ సింగ్, ర్యాన్ హిక్స్(కీపర్), ఆలివర్ పీక్, రాఫ్ మాక్‌మిల్లన్, చార్లీ ఆండర్సన్, టామ్ స్ట్రాకర్, మహ్లీ బార్డ్‌మాన్, కల్లమ్ విడ్లర్.
ఇండియా U19 (ప్లేయింగ్ XI): ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్(కెప్టెన్), ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, ఆరవెల్లి అవనీష్(కీపర్), మురుగన్ అభిషేక్, రాజ్ లింబానీ, నమన్ తివారీ, సౌమీ పాండే.
End of 25 overs!
Australia U19 reach 110/3
2 wickets so far for Naman Tiwari, 1 wicket for Raj Limbani 👌👌
Follow the match ▶️ https://t.co/RytU4cGJLu#TeamIndia | #BoysInBlue | #U19WorldCup | #INDvAUS pic.twitter.com/CeskV1rYn2
— BCCI (@BCCI) February 11, 2024
The #BoysInBlue remain unchanged for the #U19WorldCup Final 👌👌
Follow the match ▶️ https://t.co/RytU4cGJLu#TeamIndia | #INDvAUS pic.twitter.com/ufvUySMORH
— BCCI (@BCCI) February 11, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








