స్టాక్స్, బంగారం, FD.. గత 40 ఏళ్లలో ఏది ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చింది?.. దేనిలో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్!
భవిష్యత్తును ఆర్థికపరిస్థులను దృష్టిలో ఉంచుకొని చాలా మంది FDలు, గోల్డ్, స్టాక్స్‌పై దీర్ఘ కాలిక పెట్టుబలును పెడుతూ ఉంటారు. ఇక్కడే కొంత మంది దేనిలో పెట్టుబడి పెట్టాలో అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి గత 40 ఏళ్లలో ఈ మూడు పెట్టుబడులలో ఏవి ఉత్తమ రాబడులను ఇచ్చాయి. ఏవి సురక్షితమైనవో ఇక్కడ తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో ఫ్యూచర్ కోసం డబ్బులు దాచుకోవాలని చాలా మంది ఆలోచిస్తున్నారు. అందుకే డబ్బులను ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు. కానీ డబ్బు ఎక్కడ సేఫ్టీ ఉంటుంది, దేనిలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రాబడి వస్తుంది,, ఎలా పెట్టుబడి పెట్టాలి అనేది చాలా మందికి ఒక గందరగోళం. డిపాజిట్ ప్లాన్లు స్వల్పకాలిక పెట్టుబడికి అనుకూలంగా ఉంటాయని అందిరికీ తెలుసు. కానీ, దీర్ఘకాలిక పెట్టుబడికి ఏవి బెస్ట్‌గా ఉంటాయి. స్టాక్స్, FDలు సామాన్యులకు ఇష్టమైన పెట్టుబడి ఆప్షన్స్ అయినప్పటికీ.. ఈ మధ్య కాలంలో భారీగా పెరిగిన బంగారం ధరలు జనాలను బాగా అకర్షించాయి. దీంతో చాలా మంది గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. అయితే ఈ మూడింటిలో ఇప్పటి వరకు ఏవి మంచి లాభాలు ఇచ్చాయో చూద్దాం.
వైట్ ఓక్ క్యాపిటల్ అనే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ అండ్ అడ్వైజరీ సంస్థ ప్రకారం. గత 1985 నుండి 2015 వరకు 40 సంవత్సరాలలో బంగారం, సెన్సెక్స్, FDలు ఎంత వినియోగదారులకు ఎన్ని లాభాలు తెచ్చిపెట్టాయో అంచనా వేసింది. ఈ సంస్థ పరిశీలనలో ఈ మొత్తం కాలంలో డబ్బు విలువ ఎంత తగ్గింది అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. ఉదాహరణకు మీరు 1985లో బంగారం లేదా స్టాక్స్ లేదా FDలో రూ. 100 పెట్టుబడి పెడితే మీకు ఎంత లాభం వచ్చేది. ప్రస్తుతం ఆ పెట్టుబడి విలువ ఎంత ఉంటుంది? ఈ మొత్తం కాలంలో డబ్బు విలువ ఎంత తగ్గిందో వైట్‌ఓక్ క్యాపిటల్ తన నివేదికలో పేర్కొంది.
1985లో మీరు ఇన్వెస్ట్ చేసిన రూ.100 విలువ ఇదే
- బంగారం: రూ. 6,518
- బ్యాంక్ డిపాజిట్: రూ. 2,100
- సెన్సెక్స్: రూ. 13,484
- ద్రవ్యోల్బణం: రూ.1,478
1985లో ఒక రూపాయి విలువ ఇప్పుడు 14-15 రూపాయలు. అంటే ఇప్పుడు 100 రూపాయల విలువ 1,478 రూపాయలు. ఇది ద్రవ్యోల్బణ ప్రభావాన్ని సూచిస్తుంది. అంటే ఈ ద్రవ్యోల్బణ రేటు కంటే ఎక్కువ రాబడిని ఇవ్వగల పెట్టుబడులు దీర్ఘకాలిక పెట్టుబడికి మంచివని అర్థం.
పైన పేర్కొన్న సమాచారం ప్రకారం, బ్యాంకు డిపాజిట్లు ద్రవ్యోల్బణం కంటే స్వల్పంగా మాత్రమే ఎక్కువ రాబడిని ఇచ్చాయి. సెన్సెక్స్ ఎక్కువగా పెరిగినప్పిటికీ.. మధ్యలో కొన్ని సంవత్సరాలు తగ్గంది. దీనితో పోల్చితే, బంగారం ధర ఎప్పికప్పుడూ పెరుగుతూనే వచ్చింది. ఈ 40 ఏళ్లలో బంగారం 10-12% CAGR వద్ద పెరిగినట్టు వైట్ ఓక్ క్యాపిటల్ పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




