Sourav Ganguly: టీమిండియా మాజీ కెప్టెన్‌ గంగూలీ ఖరీదైన స్మార్ట్‌ ఫోన్‌ చోరీ.. ఎన్ని లక్షలో తెలుసా?

టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఖరీదైన మొబైల్ ఫోన్ చోరీకి గురైంది. దీంతో గంగూలీ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. చోరీకి గురైన మొబైల్‌లో ముఖ్యమైన వ్యక్తిగత డేటాను ఉందని, వెంటనే ట్రేస్‌ చేయాలని ఠాకూర్‌పుకూర్ పోలీసులను కోరాడు గంగూలీ .

Sourav Ganguly: టీమిండియా మాజీ కెప్టెన్‌ గంగూలీ ఖరీదైన స్మార్ట్‌ ఫోన్‌ చోరీ.. ఎన్ని లక్షలో తెలుసా?
Sourav Ganguly
Follow us

|

Updated on: Feb 11, 2024 | 4:39 PM

టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఖరీదైన మొబైల్ ఫోన్ చోరీకి గురైంది. దీంతో గంగూలీ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. చోరీకి గురైన మొబైల్‌లో ముఖ్యమైన వ్యక్తిగత డేటాను ఉందని, వెంటనే ట్రేస్‌ చేయాలని ఠాకూర్‌పుకూర్ పోలీసులను కోరాడు గంగూలీ . టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, గంగూలీ తన ఫోన్‌ను చివరిసారిగా శనివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో చూశాడు. ఆ తర్వాత మొబైల్ చోరీకి గురైంది. ప్రస్తుతం బెహలా చౌరస్తాలోని గంగూలీ ఇంటికి రంగులు వేస్తున్నారు. పెయింట్ వేసేందుకు వచ్చిన కొంతమంది కార్మికులను పోలీసులు విచారించవచ్చని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం గంగూలీ తప్పిపోయిన మొబైల్ రూ.1.6 లక్షల విలువైన స్మార్ట్‌ఫోన్ అని సమాచారం. అయితే గంగూలీ మొబైల్ దొంగతనంపై కాకుండా.. అందులోని వ్యక్తిగత డేటా లీక్ అయ్యే అవకాశం ఉందని తెగ ఆందోళన చెందుతున్నారు గంగూలీ కుటుంబ సభ్యులు. మొబైల్ దొంగతనం గురించి స్థానిక మీడియాతో మాట్లాడిన గంగూలీ.. ‘నా ఫోన్ ఇంట్లో నుండి మొబైల్‌ చోరీకి గురైంది. నేను చివరిగా జనవరి 19న ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఫోన్‌ని చూశాను. ఆ తర్వాత ఫోన్ కనిపించలేదు. దాంతో ఫోన్ కోసం చాలా చోట్ల వెతికినా దొరకలేదు. నా ఫోన్ పోయినందుకు నేను తీవ్ర ఆందోళన చెందుతున్నాను. . ఎందుకంటే ఆ ఫోన్‌లో చాలా మంది వ్యక్తుల నంబర్లు ఉన్నాయి. ఇందులో వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకు ఖాతా సమాచారం కూడా ఉంటుంది. కాబట్టి నా ఫోన్‌ను వెంటనే ట్రేస్ చేయాలని పోలీసులను కోరాను’ అని చెప్పుకొచ్చాడు.

కాగా తన ఫోన్‌లో చాలా పర్సనల్ డేటా ఉందని, అది దుర్వినియోగం చేస్తే తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారని, అందుకే త్వరగా మొబైల్ కనుక్కోవాలని గంగూలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. టీమిండియా క్రికెటర్‌ ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఫోన్‌ను ట్రేస్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే దొంగ ఆచూకీ ఇంకా లభించలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..