AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDW vs UAEW: టీ20ల్లో తొలిసారి చరిత్ర సృష్టించిన భారత్.. లంకలో భారత మహిళల రికార్డ్.. అదేంటంటే?

India Women vs United Arab Emirates Women, 5th Match, Group A: మహిళల ఆసియా కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆ జట్టు 78 పరుగుల భారీ తేడాతో యూఏఈని ఓడించింది. ఈ విజయంతో భారత జట్టు సెమీఫైనల్‌కు మరింత చేరువైంది.

INDW vs UAEW: టీ20ల్లో తొలిసారి చరిత్ర సృష్టించిన భారత్.. లంకలో భారత మహిళల రికార్డ్.. అదేంటంటే?
Indw Vs Uaew Richa Ghosh
Venkata Chari
|

Updated on: Jul 21, 2024 | 6:15 PM

Share

India Women vs United Arab Emirates Women, 5th Match, Group A:  మహిళల ఆసియా కప్ 2024లో 5వ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాట్స్‌మెన్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ మ్యాచ్‌లో టీ20 క్రికెట్ చరిత్రలో, మహిళల ఆసియా కప్ చరిత్రలో టీమ్ ఇండియా అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ రిచా ఘోష్‌ హాఫ్‌ సెంచరీలతో ఆడి జట్టును ఆదుకున్నారు.

టీమ్ ఇండియా భారీ స్కోర్..

శ్రీలంకలోని రంగిరి దంబుల్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యూఏఈ టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇది భారత బ్యాట్స్‌మెన్‌లు తప్పు అని నిరూపించారు. ఆరంభం నుంచి టీమ్ ఇండియా వేగంగా బ్యాటింగ్ చేసింది. దీంతో భారత జట్టు 52 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా.. ఆ తర్వాత 106 పరుగుల వద్ద నాలుగో వికెట్ కూడా పడింది. అయితే ఆ తర్వాత, హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. మహిళల ఆసియా కప్‌లో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద స్కోరు కాగా, టీ20లో భారత జట్టు 200 పరుగులు చేయడం ఇదే తొలిసారి.

టీ20లో భారత మహిళల జట్టు భారీ స్కోర్లు..

201/5 – UAE, 2024

ఇవి కూడా చదవండి

198/4 – ఇంగ్లాండ్, 2018

194/5 – న్యూజిలాండ్, 2018

రిచా ఘోష్‌ తుఫాన్ ఇన్నింగ్స్‌..

ఈ మ్యాచ్‌లో టీమిండియా తరుపున రిచా ఘోష్ బలమైన ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 29 బంతుల్లో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఈ సమయంలో ఆమె 220.68 స్ట్రైక్ రేట్‌తో 12 ఫోర్లు, 1 సిక్స్ కొట్టింది. టీ20 కెరీర్‌లో ఆమెకు ఇదే తొలి అర్ధ సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో వరుసగా 5 ఫోర్లు కొట్టిన ఘనతను కూడా రిచా ఘోష్ సాధించింది. దీని కారణంగా టీమ్ ఇండియా 200 పరుగుల స్కోరును తాకడంలో విజయవంతమైంది. అదే సమయంలో, 6వ స్థానంలో ఆడుతూ భారతదేశం తరపున ఏ బ్యాటర్ చేసిన అతిపెద్ద స్కోరు కూడా ఇదే కావడం విశేషం.

హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్..

ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడింది. జట్టును మేనేజ్ చేస్తూ అద్భుత ప్రదర్శన కనబరిచింది. 47 బంతుల్లో ఆమె బ్యాట్‌ నుంచి 66 పరుగులు వచ్చాయి. ఈ సమయంలో హర్మన్‌ప్రీత్ కౌర్ 7 ఫోర్లు, 1 సిక్స్ కొట్టింది. అదే సమయంలో ఓపెనర్ షెఫాలీ వర్మ వేగవంతమైన ఆరంభం ఇచ్చి 18 బంతుల్లో 37 పరుగులు చేసింది. మరోవైపు స్మృతి మంధాన 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. జెమిమా రోడ్రిగ్స్ కూడా 14 పరుగులు మాత్రమే చేయగలిగింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీప్తి శర్మ 2 వికెట్లు తీయగా, రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్, తనూజా కన్వర్, రాధా యాదవ్‌లకు తలో వికెట్ దక్కింది. వికెట్ కీపర్ రిచా ఘోష్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది. అజేయంగా 64 పరుగులు చేయడంతో పాటు స్టంపింగ్ కూడా చేసింది. 2 మ్యాచ్‌ల తర్వాత ఆ జట్టు ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. టీం ఇండియా తదుపరి మ్యాచ్ నేపాల్‌తో జులై 23న జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..