AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: కావ్య మారన్‌ని ఛాంపియన్‌గా నిలబెట్టాడు.. కట్‌చేస్తే.. మరో జట్టును విజేతగా చేసేందుకు సిద్ధం.. ఎవరంటే?

Lucknow Super Giants: ఐపీఎల్ 2025కి ముందు భారత అనుభవజ్ఞుడైన క్రికెటర్ ఈ లీగ్‌కి తిరిగి రావచ్చు. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఐపీఎల్ ఛాంపియన్‌గా మార్చడంలో ఈ అనుభవజ్ఞుడు కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిపై కన్నేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు.. త్వరలోనే తమ జట్టులోకి చేర్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

IPL 2025: కావ్య మారన్‌ని ఛాంపియన్‌గా నిలబెట్టాడు..  కట్‌చేస్తే.. మరో జట్టును విజేతగా చేసేందుకు సిద్ధం.. ఎవరంటే?
Kavya Maran Ipl 2025
Venkata Chari
|

Updated on: Jul 21, 2024 | 6:54 PM

Share

Kavya Maran – VVS Laxman: ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరగబోతోంది. దీని కోసం అన్ని జట్లు తమ సన్నాహాలను ముమ్మరం చేశాయి. ఈసారి చాలా మంది పెద్ద స్టార్ ప్లేయర్‌లు తమ టీమ్‌లను మార్చవచ్చని నివేదికలు వచ్చాయి. ఇందులో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రోహిత్ శర్మ వంటి పెద్ద పేర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఓ టీమ్ కోచింగ్ స్టాఫ్‌కు సంబంధించిన ఓ పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది. ఈ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో కావ్య మారన్ జట్టు అంటే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఛాంపియన్‌గా చేయడంలో ముఖ్యమైన సహకారం అందించిన అనుభవజ్ఞుడి ప్రవేశం కూడా ఉండవచ్చు.

ఛాంపియన్‌గా నిలబెట్టిన ఈ టీమ్ చేయి పట్టుకోనున్న కావ్య మారన్‌..

IPL 2025కి ముందు, IPL ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ భారత లెజెండ్ VVS లక్ష్మణ్‌ను తన కోచింగ్ స్టాఫ్‌లో ఒక భాగంగా చేసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి. లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి అధిపతిగా వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీకాలం సెప్టెంబర్‌తో ముగియనుంది. ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్మణ్ తన పదవీకాలాన్ని పొడిగించడం ఇష్టం లేదని భావిస్తున్నారు. టీమిండియా ప్రధాన కోచ్‌గా బీసీసీఐ మొదటి ఎంపిక కూడా అతనే. అయితే అతను రాహుల్ ద్రవిడ్ స్థానంలోకి రావడానికి అంగీకరించలేదు.

వీవీఎస్ లక్ష్మణ్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కలిసి ఐపీఎల్‌లో పనిచేశాడు. నిజానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 2016లో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. అప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ మెంటార్‌గా ఉన్నారు. అదే సమయంలో, లక్నో సూపర్ జెయింట్స్ కోచింగ్ స్టాఫ్‌లో ప్రస్తుతం జస్టిన్ లాంగర్, శ్రీధరన్ శ్రీరామ్, మోర్నే మోర్కెల్, జాంటీ రోడ్స్ వంటి దిగ్గజాలు ఉన్నారు. కాబట్టి, ఈ జట్టులో VVS లక్ష్మణ్‌కు ఏ పాత్రను అందిస్తారో చూడాలి.

NCAలో లక్ష్మణ్ స్థానంలో ఎవరు ఉంటారు?

ఒక నివేదిక ప్రకారం, VVS లక్ష్మణ్ స్థానంలో భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి కొత్త హెడ్‌గా విక్రమ్ రాథోడ్‌ని నియమించవచ్చు. విక్రమ్ రాథోడ్ పదవీ కాలం ఇటీవలే ముగిసింది. రాథోడ్ 2012 నుంచి BCCIతోనే ఉన్నారు. మొదట అతను జాతీయ సెలెక్టర్‌గా, ఆ తరువాత బ్యాటింగ్ కోచ్‌గా టీమ్ ఇండియాలో చేరాడు. సంజయ్ బంగర్ కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత 2019 ఆగస్టులో విక్రమ్ రాథోడ్ భారత బ్యాటింగ్ కోచ్‌గా నియమితులయ్యారు. దీని తర్వాత, 2021 సంవత్సరంలో రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్ అయిన తర్వాత కూడా అతను జట్టులోనే ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..