INDW vs UAEW: వరుసగా రెండో విజయం.. ఆసియాకప్‌లో భారత మహిళల దూకుడు..

India Women vs United Arab Emirates Women, 5th Match, Group A: మహిళల ఆసియా కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. భారత జట్టు 78 పరుగుల భారీ తేడాతో యూఏఈని ఓడించింది.

INDW vs UAEW: వరుసగా రెండో విజయం.. ఆసియాకప్‌లో భారత మహిళల దూకుడు..
Ind V Uae Report
Follow us

|

Updated on: Jul 21, 2024 | 5:43 PM

India Women vs United Arab Emirates Women, 5th Match, Group A: మహిళల ఆసియా కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. భారత జట్టు 78 పరుగుల భారీ తేడాతో యూఏఈని ఓడించింది. శ్రీలంకలోని రంగి దంబుల్లా స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో యూఏఈ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు పవర్‌ప్లేలోనే టాప్-3 వికెట్లను కోల్పోయింది. స్మృతి మంధాన 13 పరుగులు, షెఫాలీ వర్మ 37, దయాళన్ హేమలత 2 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 66 పరుగుల ఇన్నింగ్స్ ఆడి జట్టును 201 పరుగులకు చేర్చింది. అలాగే, హర్మన్ జెమిమా రోడ్రిగ్స్ (14 పరుగులు), రిచా ఘోష్‌తో కలిసి అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసింది. రిచా 220.69 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 64 పరుగులతో నిలిచింది. ఈ టోర్నీలో అర్ధశతకం సాధించిన తొలి భారత వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీప్తి శర్మ 2 వికెట్లు తీయగా, రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్, తనూజా కన్వర్, రాధా యాదవ్‌లకు తలో వికెట్ దక్కింది.

రెండు జట్ల ప్రాబబుల్ ప్లేయింగ్-11 ఇదే..

భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దయాలాన్ హేమ్లత, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, రేణుకా సింగ్, రాధా యాదవ్, తనూజా కన్వర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..