AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS, World Cup Final: ‘140 కోట్ల మంది మీ గెలుపు కోసం ఎదురుచూస్తున్నారు’.. టీమిండియాకు మోడీ, సోనియా విషెస్‌

2023 ప్రపంచ కప్ ఫైనల్ అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచకప్ ట్రోఫీ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో అజేయంగా ఫైనల్స్‌కు చేరిన భారత జట్టు కప్‌ను గెల్చుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. భారత్ గెలుపుకోసం ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. క్రికెట్ దిగ్గజాలతో పాటు ప్రముఖులు భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు

IND vs AUS, World Cup Final: '140 కోట్ల మంది మీ గెలుపు కోసం ఎదురుచూస్తున్నారు'.. టీమిండియాకు మోడీ, సోనియా విషెస్‌
Sonia Gandhi, Narendra Modi
Basha Shek
|

Updated on: Nov 19, 2023 | 3:29 PM

Share

2023 ప్రపంచ కప్ ఫైనల్ అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచకప్ ట్రోఫీ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో అజేయంగా ఫైనల్స్‌కు చేరిన భారత జట్టు కప్‌ను గెల్చుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. భారత్ గెలుపుకోసం ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. క్రికెట్ దిగ్గజాలతో పాటు ప్రముఖులు భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ టీమిండియాకు బెస్ట్‌ విషెస్‌ చెప్పారు. ‘ఆల్ ది బెస్ట్ టీమిండియా. 140 కోట్ల మంది ప్రజలు మీ గెలుపు కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. మీరు బాగా ఆడి ఆ అంచనాలు అందుకుంటారని ఆశిస్తున్నాను. క్రీడాస్ఫూర్తిని చాటాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు మోడీ ట్వీట్‌ చేశారు . ప్రధాని మోడీతో పాటు పలువురు రాజకీయ నేతలు టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఒక వీడియో సందేశంలో, భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలు ఎల్లప్పుడూ లింగం, ప్రాంతం, భాష, మతం మరియు తరగతికి అతీతంగా దేశాన్ని ఏకం చేస్తాయన్నారు సోనియా. మీరు ఈ ఫైనల్స్‌కు సిద్ధమవుతున్న వేళ, దేశం మొత్తం మీ విజయం కోసం ఎదురుచూస్తోంది. మీకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టీమ్ ఇండియాకు శుభం. జై హింద్ అని టీమిండియాకు సందేశం పంపారు కాంగ్రెస్‌ అధినేత్రి.

ఇక టీమిండియా చరిత్ర తిరగరాయాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ‘టీమిండియాకి బెస్ట్ విషెస్. వరల్డ్ కప్‌ ఫైనల్‌కి ఆల్‌ ది బెస్ట్. మీ సత్తా చాటండి. అద్భుతంగా రాణించండి. చరిత్ర సృష్టించండి. మొత్తం దేశమంతా మీ వెంట ఉంది’ అని కేజ్రీవాల్ ప్రోత్సహించారు. కాంగ్రెస్ పార్టీ కూడా టీమిండియాకి ఆల్‌ ది బెస్ట్ చెప్పింది. ‘ఇండియా జీతేగా’ అంటూ ప్లేయర్స్ అందరి పేర్లు కలుపుతూ కాస్త స్పెషల్‌గా విషెస్ చెప్పింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే టీమిండియాకి విషెస్ చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ప్రధాని మోడీ ట్వీట్..

అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..