AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: సింగిల్ ప్రపంచ కప్ ఎడిషన్‌లో ఇరగదీసిన రోహిత్.. కెప్టెన్‌గా తిరుగులేని స్థానం..

2023 ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేస్తోన్న ఆదిలోనే కష్టాల్లో పడింది. వార్తలు రాసే సమయానికి టీమిండియా 17 ఓవర్లలో 3 వికెట్లకు 101 పరుగులు చేసింది.

IND vs AUS: సింగిల్ ప్రపంచ కప్ ఎడిషన్‌లో ఇరగదీసిన రోహిత్.. కెప్టెన్‌గా తిరుగులేని స్థానం..
తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీ, 2027 వన్డే ప్రపంచకప్ రెండింటికీ కొత్త కెప్టెన్‌తో టీమ్ ఇండియా రంగంలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రాబోయే రోజుల్లో వైట్ బాల్ అంటే వన్డే క్రికెట్ భవిష్యత్తు గురించి రోహిత్ శర్మతో చర్చి్ంచనుందంట. తదుపరి వన్డే ప్రపంచకప్ 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వేలో జరగనుంది. అప్పుడు రోహిత్ శర్మకు 40 ఏళ్లు ఉంటాయి. వచ్చే ఏడాది 2024లో టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. ఈ ప్రపంచకప్ టోర్నీ అమెరికా-వెస్టిండీస్‌లో జరగనుంది. అప్పుడు రోహిత్ శర్మ వయసు 37 ఏళ్లు. అప్పటి వరకు రోహిత్ టీమ్ ఇండియాకు ఆడే అవకాశాలు తక్కువే. అయితే, విరాట్ కోహ్లీ ఇప్పటికే T20 ఫార్మాట్‌కు దూరంగా ఉన్నాడు. తద్వారా రానున్న రోజుల్లో టీమ్ ఇండియాలో మార్పుల సీజన్ ప్రారంభం కానుంది.
Venkata Chari
|

Updated on: Nov 19, 2023 | 3:27 PM

Share

Rohit Sharma Runs in World Cup 2023: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన CWC 2023 ఫైనల్‌లో కెప్టెన్‌గా ఒకే ఎడిషన్‌లో అత్యధిక ప్రపంచ కప్ పరుగులు చేసిన భారత ఆటగాడు రోహిత్ శర్మ ఆదివారం న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్‌ను అధిగమించాడు.

ఈ మ్యాచ్‌కు ముందు 550 పరుగులు చేసిన రోహిత్, తన 29వ పరుగుతో విలియమ్సన్‌ను దాటి 2019 ఎడిషన్‌లో వచ్చిన 578 పరుగుల స్కోరును అధిగమించాడు.

ఇవి కూడా చదవండి

అంతకుముందు, 36 ఏళ్ల వన్డే ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగుల జాబితాలో శ్రీలంక గ్రేట్ కుమార సంగక్కరను అధిగమించాడు.

ఒకే ప్రపంచకప్ ఎడిషన్‌లో కెప్టెన్ చేసిన అత్యధిక పరుగులు ఇవే..

2023లో రోహిత్ శర్మ 597 పరుగులు

2019లో కేన్ విలియమ్సన్ 578 పరుగులు చేశాడు

2007లో మహేల జయవర్ధనే 548 పరుగులు చేశాడు

2007లో రికీ పాంటింగ్ 539 పరుగులు చేశాడు

2019లో ఆరోన్ ఫించ్ 507 పరుగులు చేశాడు.

మ్యాచ్ విషయానికి వస్తే..

2023 ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేస్తోన్న ఆదిలోనే కష్టాల్లో పడింది. వార్తలు రాసే సమయానికి టీమిండియా 17 ఓవర్లలో 3 వికెట్లకు 101 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు. 4 పరుగుల వద్ద శ్రేయాస్ అయ్యర్,47 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ, 4 పరుగుల వద్ద ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఔటయ్యారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..