IND vs AUS: జోరుగా మ్యాచ్.. కట్‌చేస్తే.. మైదానంలో ఎంట్రీ ఇచ్చిన ఓ వ్యక్తి.. కోహ్లీ వద్దకు వెళ్లి ఏం చేశాడంటే?

IND vs AUS Interrupted by Pitch Invader: ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో చిన్న అంతరాయం జరిగింది. ఉత్కంఠగా సాగుతోన్న మ్యాచ్‌లో ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో మ్యాచ్ కొద్దిసేపు ఆగిపోయింది.

IND vs AUS: జోరుగా మ్యాచ్.. కట్‌చేస్తే.. మైదానంలో ఎంట్రీ ఇచ్చిన ఓ వ్యక్తి.. కోహ్లీ వద్దకు వెళ్లి ఏం చేశాడంటే?
Ind Vs Aus Interrupted By Pitch Invader
Follow us
Venkata Chari

|

Updated on: Nov 19, 2023 | 4:09 PM

IND vs AUS Interrupted by Pitch Invader: ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో చిన్న అంతరాయం జరిగింది. ఉత్కంఠగా సాగుతోన్న మ్యాచ్‌లో ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో మ్యాచ్ కొద్దిసేపు ఆగిపోయింది.

ఆ వ్యక్తి తన టీ షర్ట్ ముందు భాగంలో ‘స్టాప్ బాంబింగ్ పాలస్తీనా’ అని, వెనుక భాగంలో ‘ఫ్రీ పాలస్తీనా’ అంటూ ప్రదర్శించాడు. మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత భారత బ్యాటర్ విరాట్ కోహ్లీని కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది, అతడిని పట్టుకుని బయటకు తీసుకెళ్లారు. అనంతరం మ్యాచ్ మొదలైంది.

ఇరు జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..