Rohit Sharma: షాకింగ్ న్యూస్.. సిడ్నీ టెస్ట్ నుంచి రోహిత్ ఔట్.. ప్లేయింగ్ XIపై క్లారిటీ ఇచ్చేసిన గౌతమ్ గంభీర్?
Gautam Gambhir on Sydney Test Playing XI: సిడ్నీ టెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ గురించి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పెద్ద అప్‌డేట్ ఇచ్చారు. గాయం కారణంగా ఆకాశ్‌దీప్‌కు దూరంగా ఉంటాడని చెప్పుకొచ్చాడు. అయితే, రోహిత్‌పై ప్రశ్నకు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
Gautam Gambhir on Sydney Test Playing XI: సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య 5వ టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. కానీ, అందులో రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనేది చెప్పడం కష్టం. భారత జట్టు కెప్టెన్ ఆటపై ఉత్కంఠ నెలకొంది. మరి, ఇప్పుడు ఈ ప్రశ్నకు గౌతమ్ గంభీర్ కూడా మీడియా సమావేశంలో నేరుగా సమాధానం ఇవ్వలేకపోవడం గమనార్హం. సిడ్నీలో రోహిత్ శర్మ ఆడతాడా? అని విలేకరుల సమావేశంలో టీమిండియా ప్రధాన కోచ్‌ని సూటిగా ప్రశ్నించారు. దీనిపై టాస్ సమయంలోనే సమాధానం చెబుతానంటూ గంభీర్ చెప్పుకొచ్చాడు.
సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మ ఆడటంపై సస్పెన్స్..
రోహిత్ శర్మ కెప్టెన్. ఇక, జట్టులో కెప్టెన్ స్థానం ఇప్పటికే ఖరారైంది. కానీ, జట్టు ప్రధాన కోచ్ విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ ఆటపై టాస్ సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో, విషయం కాస్త సీరియస్‌గా మారింది. మ్యాచ్ రోజున పిచ్ పరిస్థితి ఎలా ఉండో చూడాలి. అందుకు తగ్గట్టుగానే ప్లేయింగ్ ఎలెవన్‌పై నిర్ణయం తీసుకుంటామని గంభీర్ తెలిపాడు. దీంతో రోహిత్ శర్మపై వేటు వేస్తారా లేదా అనే ప్రశ్న వినిపిస్తోంది.
రోహిత్ శర్మ ఆటపై సస్పెన్స్ ఎందుకు?
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, టీమిండియా కెప్టెన్ అంటే రోహిత్ శర్మకు సంబంధించి ప్రధాన కోచ్ వద్ద కూడా స్పష్టమైన సమాధానం ఎందుకు లేదు? అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం కూడా టెస్టుల్లో రోహిత్ ప్రదర్శనే దీనికి సమాధానం. ప్రస్తుత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు ఆడిన 3 టెస్టుల్లో రోహిత్ శర్మ 5 ఇన్నింగ్స్‌ల్లో 31 పరుగులు మాత్రమే చేశాడు. అంటే, అతని బ్యాటింగ్ సగటు కేవలం 6.20 మాత్రమే. ఇది ఆస్ట్రేలియాలో పర్యటించిన ప్రపంచంలోని ఏ టెస్టు కెప్టెన్‌తోనూ పోల్చితే ఇది అతి తక్కువ.
ఆకాష్‌దీప్ సిడ్నీ టెస్టు ఆడడు: గంభీర్..
అయితే, గౌతమ్ గంభీర్ ఆకాష్‌దీప్ విషయంలో ఎలాంటి సస్పెన్స్‌ను ఉంచకుండా పరిస్థితిపై క్లారిటీ ఇచ్చాడు. టీమిండియా ప్రధాన కోచ్ ప్రకారం, ఈ ఫాస్ట్ బౌలర్ సేవలను భారత్ కోల్పోవాల్సి వస్తుంది. అంటే సిడ్నీ టెస్టుకు దూరంగా ఉంటాడని అర్థం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..