AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: హార్దిక్ గాయంపై ఆందోళన.. ఫీల్డింగ్ చేయకుండానే మైదానం బయటకు.. మరి బ్యాటింగ్?

Hardik Pandya Injury: గాయం తీవ్రతపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒక ప్రకటనలో సమచారం అందించింది. "హార్దిక్ పాండ్యా గాయం ప్రస్తుతం అంచనా వేశాం. అతనిని స్కాన్ కోసం తీసుకువెళుతున్నాం" అంటూ సమాచారం ఇచ్చింది. అయితే, ఈ గాయం ఎంత పెద్దది అనేది ఇప్పటి వరకైతే ఎటువంటి సమాచారం లేదు.

IND vs AUS: హార్దిక్ గాయంపై ఆందోళన.. ఫీల్డింగ్ చేయకుండానే మైదానం బయటకు.. మరి బ్యాటింగ్?
India Vs Bangladesh Hardik Pandya
Venkata Chari
|

Updated on: Oct 19, 2023 | 5:09 PM

Share

Hardik Pandya Injury: పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న ICC ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌లో భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో మైదానం వీడాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో, హార్దిక్ మూడో డెలివరీ సంధించాడు. దానిని ఓపెనింగ్ బ్యాటర్ లిట్టన్ దాస్‌ స్ట్రైట్‌గా ఆడాడు. ఈ క్రమంలో తన కుడి కాలుతో బంతిని ఆపడానికి ప్రయత్నించాడు. దీంతో ఎడమకాలిపై బలంగా పడిపోయాడు. దీంతో కాలు మడతపడడంతోపాటు హార్దిక్ బరువు కూడా ఆయనపై పడింది.

బంతి బౌండరీ వెళ్తున్నా.. కెమెరాలు మాత్రం భారత ఆల్‌రౌండర్‌పైకి మళ్లాయి. గాయం తీవ్రం కావడంతో హార్దిక్ నడవడం కష్టమైంది.

ఇవి కూడా చదవండి

హార్దిక్ నొప్పితో మెలికలు తిరగడంతో ఫిజియో ఎంట్రీ ఇచ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఎడమ కాలికి ట్యాప్ వేశారు.

ఎట్టకేలకు హార్దిక్ తన రన్-అప్ వైపు కుంటుతూ వెళ్లాడు. అతను బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి చివరి క్షణంలో జోక్యం చేసుకుని, విశ్రాంతి తీసుకొమ్మని చెప్పారు. దీంతో మైదానం నుంచి బయటకువెళ్లాడు. ఆ ఓవర్‌లో చివరి మూడు బంతుల్లో కోహ్లి బౌలింగ్ చేయడంతో పూణె ప్రేక్షకుల్లో ఆనందం వెళ్లివిరిపిసింది.

గాయం తీవ్రతపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒక ప్రకటనలో సమచారం అందించింది. “హార్దిక్ పాండ్యా గాయం ప్రస్తుతం అంచనా వేశాం. అతనిని స్కాన్ కోసం తీసుకువెళుతున్నాం” అంటూ సమాచారం ఇచ్చింది. అయితే, ఈ గాయం ఎంత పెద్దది అనేది ఇప్పటి వరకైతే ఎటువంటి సమాచారం లేదు.

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ మొత్తం హార్దిక్ ఫీల్డింగ్‌కు అందుబాటులో ఉండడని బ్రాడ్‌కాస్టర్లు తెలియజేశారు. అయితే, అతను 120 నిమిషాల తర్వాత లేదా ఐదు వికెట్లు పడిపోయిన తర్వాత బ్యాటింగ్ చేయగలడు అని చెబుతున్నారు. ఎందుకంటే ఇది అంతర్గత గాయం, బాహ్య గాయం కాదు.

2018లో ఇంగ్లండ్‌లో జరిగిన టెస్ట్ సిరీస్ నుంచి వెన్నుముక సమస్యల కారణంగా కెరీర్‌కు ఆటంకం కలుగుతున్న హార్దిక్‌కి ఇవి ఆందోళన కలిగించే సంకేతాలుగా మారాయి. ఆ సంవత్సరం తర్వాత సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్‌లో సమస్య మళ్లీ తలెత్తింది. అతను వెస్టిండీస్‌తో ఆ తర్వాత స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియాలో T20 సిరీస్‌లకు దూరమయ్యాడు. 2019లో ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్ తర్వాత WI పర్యటనలో అతనికి విశ్రాంతి లభించింది.

ఇరు జట్లు:

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మెహిదీ హసన్ మిరాజ్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(కీపర్), మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరీఫుల్ ఇస్లాం.

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..