Video: 8 ఏళ్ల తర్వాత కింగ్ కోహ్లీ బౌలింగ్.. ఓవర్ కాదండోయ్.. కేవలం 3 బంతులే.. ఎందుకో తెలుసా?

ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. అతని స్థానంలో బౌలింగ్ చేసేందుకు విరాట్ కోహ్లీ వచ్చాడు. 8 ఏళ్ల తర్వాత కోహ్లి ప్రపంచకప్‌లో బౌలింగ్ చేశాడు. కోహ్లీ 3 బంతుల్లో 2 పరుగులు ఇచ్చాడు.

Video: 8 ఏళ్ల తర్వాత కింగ్ కోహ్లీ బౌలింగ్.. ఓవర్ కాదండోయ్.. కేవలం 3 బంతులే.. ఎందుకో తెలుసా?
Virat Kohli Bowling
Follow us
Venkata Chari

|

Updated on: Oct 19, 2023 | 3:49 PM

2023 ప్రపంచకప్‌లో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. అతని స్థానంలో బౌలింగ్ చేసేందుకు విరాట్ కోహ్లీ వచ్చాడు. 8 ఏళ్ల తర్వాత కోహ్లి ప్రపంచకప్‌లో బౌలింగ్ చేశాడు. కోహ్లీ 3 బంతుల్లో 2 పరుగులు ఇచ్చాడు.

9వ ఓవర్ బౌలింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా తొలి మూడు బంతులు వేసిన తర్వాత గాయపడ్డాడు. బాల్ ఆపే క్రమంలో కాలికి గాయమైంది. ఫిజియో వచ్చి టేపింగ్ వేసినా.. నొప్పి తగ్గకపోవడంతో బౌలింగ్ చేయలేకపోయాడు. దీంతో మిగిలిన మూడు బంతులను విరాట్ కోహ్లీ వేయాల్సి వచ్చింది. మూడు బంతులు విసిరిన కోహ్లీ తొలి బంతికి పరుగులు ఏమీ ఇవ్వలేదు. రెండో బంతికి సింగిల్, మూడో బంతికి సింగ్ ఇచ్చాడు. దీంతో తన మూడు బంతుల్లో 2 పరుగులు ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

కాగా, గాయపడిన హార్దిక్ ప్లేస్‌లో సూర్య కుమార్ యాదవ్ ఫీల్డింగ్ చేసేందుకు వచ్చాడు. అయితే, గాయంపై ఎలాంటి అప్‌డేట్ అందలేదు.

విరాట్ కోహ్లీ బౌలింగ్ వీడియో..

View this post on Instagram

A post shared by ICC (@icc)

బంగ్లాదేశ్ జట్టు 18 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. క్రీజులో లిటన్ దాస్, కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో ఉన్నారు. లిటన్ తన 12వ హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నాడు.

51 పరుగుల వద్ద తాంజిద్ హసన్ ఔటయ్యాడు. అతన్ని కుల్దీప్ యాదవ్ ఎల్‌డబ్ల్యూబీగా మార్చాడు.

తాంజిద్ 41 బంతుల్లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి..

ఓపెనర్ తాంజిద్ హసన్ 41 బంతుల్లో యాభై పరుగులు పూర్తి చేశాడు. అతను తన వన్డే కెరీర్‌లో 41 బంతుల్లో తొలి అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. 43 బంతుల్లో 51 పరుగులు చేసి ఔటయ్యాడు.

తాంజిద్-లిట్టన్ పటిష్ట శుభారంభం..

ఓపెనర్ తాంజిద్ హసన్ తమీమ్, లిట్టన్ దాస్ తో కలిసి బంగ్లాదేశ్ జట్టుకు శుభారంభం అందించారు. వీరిద్దరూ 88 బంతుల్లో 93 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని కుల్దీప్ యాదవ్ తంజిద్‌కు ఎల్‌బీడబ్ల్యూ చేశాడు. ప్రపంచకప్‌లో కుల్దీప్ ఆరో వికెట్ తీశాడు.

ఇరు జట్లు:

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మెహిదీ హసన్ మిరాజ్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(కీపర్), మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరీఫుల్ ఇస్లాం.

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే