IND vs BAN: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన బంగ్లా ఓపెనర్స్.. టీమిండియా టార్గెట్ 257
India vs Bangladesh, 17th Match: 2023 ప్రపంచకప్‌లో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని, నిర్ణీత 50 ఓవర్లలో 256 పరుగులు చేసింది. దీంతో రోహిత్ సేనకు 257 పరుగుల టార్గెట్‌ను అందించింది. బంగ్లా బ్యాటర్లలో తస్జీద్ హసన్ 51, లిటన్ దాస్ 66 పరుగులతో ఆకట్టుకోగా, చివర్లో వచ్చిన మహ్మదుల్లా 46 పరుగులతో స్కోర్‌ను 250 దాటించడంలో సహాయపడ్డాడు.
India vs Bangladesh, 17th Match: 2023 ప్రపంచకప్‌లో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని, నిర్ణీత 50 ఓవర్లలో 256 పరుగులు చేసింది. దీంతో రోహిత్ సేనకు 257 పరుగుల టార్గెట్‌ను అందించింది. బంగ్లా బ్యాటర్లలో తస్జీద్ హసన్ 51, లిటన్ దాస్ 66 పరుగులతో ఆకట్టుకోగా, చివర్లో వచ్చిన మహ్మదుల్లా 46 పరుగులతో స్కోర్‌ను 250 దాటించడంలో సహాయపడ్డాడు. ఇక భారత బౌలర్లలో సిరాజ్, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, శార్దుల్, కుల్దీప్ తలో వికెట్ పడగొట్టారు.
హార్దిక్ పాండ్యా మ్యాచ్ సమయంలో కోహ్లీ బౌలింగ్ చేయడానికి వచ్చిన సమయంలో గాయపడ్డాడు. అతని స్థానంలో బౌలింగ్ చేసేందుకు విరాట్ కోహ్లీ వచ్చాడు. 8 ఏళ్ల తర్వాత కోహ్లి ప్రపంచకప్‌లో బౌలింగ్ చేశాడు. కోహ్లీ 3 బంతుల్లో 2 పరుగులు ఇచ్చాడు. పాండ్యా బౌలింగ్, ఫీల్డింగ్‌లో కనిపించడం లేదు.
62 బంతుల్లో లిట్టన్ దాస్ అర్ధశతకం..
ఓపెనర్ లిట్టన్ దాస్ తన వన్డే కెరీర్‌లో 12వ అర్ధశతకం పూర్తి చేశాడు. 82 బంతుల్లో 62 పరుగులు చేసి ఔటయ్యాడు. అతను 80.49 స్ట్రైక్ రేట్‌తో 7 ఫోర్ల సహాయంతో పరుగులు చేశాడు.
తాంజిద్ 41 బంతుల్లో తొలి హాఫ్ సెంచరీ..
View this post on Instagram
ఓపెనర్ తాంజిద్ హసన్ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతను తన వన్డే కెరీర్‌లో 41 బంతుల్లో తొలి అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. 43 బంతుల్లో 51 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఇరు జట్లు:
View this post on Instagram
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మెహిదీ హసన్ మిరాజ్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(కీపర్), మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరీఫుల్ ఇస్లాం.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..