India vs New Zealand, 1st Semi-Final: టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో ఎవరున్నారంటే?
2023 ప్రపంచకప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ చేయనుంది. అయితే, టీమిండియా ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు రాలేదు.

India vs New Zealand, 1st Semi-Final: 2023 ప్రపంచకప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ చేయనుంది. అయితే, టీమిండియా ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు రాలేదు.
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా 8వ సారి, న్యూజిలాండ్ 9వ సారి సెమీఫైనల్ ఆడనుంది. టోర్నీలో ఇరు జట్లు వరుసగా రెండోసారి సెమీస్‌లో తలపడనున్నాయి.
హెడ్-టు-హెడ్, ఇటీవలి రికార్డు..
ODI ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ పైచేయి సాధించింది. టోర్నీలో ఇరుజట్ల మధ్య 10 మ్యాచ్‌లు జరిగాయి. న్యూజిలాండ్ 5, భారత్ 4 గెలిచింది. 2019లో ఒక మ్యాచ్ వర్షం కారణంగా అసంపూర్తిగా మిగిలిపోయింది.
ఈ ప్రపంచకప్‌లో చివరిసారిగా 21వ లీగ్ మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. ధర్మశాలలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
భారత్, న్యూజిలాండ్ మధ్య ఇప్పటి వరకు మొత్తం 117 వన్డేలు జరిగాయి. భారత్ 59 మ్యాచ్‌లు, న్యూజిలాండ్ 50 మ్యాచ్‌లు గెలిచాయి. 7 మ్యాచ్‌లు అసంపూర్తిగా మిగిలి ఉండగా, ఒక మ్యాచ్ కూడా టై అయింది.
ఇరుజట్లు:
View this post on Instagram
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్(కీపర్), మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.








