IND vs NZ: రోహిత్ శర్మ @ 50.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలి బ్యాటర్‌గా హిట్‌మ్యాన్.. గేల్ రికార్డ్ బ్రేక్..
Rohit Sharma, India vs New Zealand, 1st Semi-Final: ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతోన్న సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్ చరిత్రలో 50 సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు.

India vs New Zealand, 1st Semi-Final: బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతోన్న సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్ చరిత్రలో 50 సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు.
హిట్‌మ్యాన్ ఈ మ్యాచ్‌లో ఐదో ఓవర్‌లో పేసర్ ట్రెంట్ బౌల్ట్‌లో సిక్స్‌తో క్రిస్ గేల్ 49 సిక్సులను బ్రేక్ చేసి, సరికొత్త రికార్డ్ లిఖించాడు. రోహిత్‌కి ఇది మూడో ప్రపంచకప్. దీనికి ముందు, హిట్‌మ్యాన్ 2015, 2019 ODI ప్రపంచకప్‌లో కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.
గ్లెన్ మాక్స్‌వెల్ (43), ఏబీ డివిలియర్స్, డేవిడ్ వార్నర్ (37) ప్రపంచ కప్‌లో సిక్స్-హిటర్ల లిస్ట్‌లో టాప్-5 లిస్ట్‌లో ఉన్నారు.
ప్రపంచ కప్‌లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు..
50 – రోహిత్ శర్మ
49 – క్రిస్ గేల్
43 – గ్లెన్ మాక్స్‌వెల్
37 – ఏబీ డివిలియర్స్
37 – డేవిడ్ వార్నర్
ఒకే ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లు..
27 – రోహిత్ శర్మ (2023)
26 – క్రిస్ గేల్ (2015)
22 – ఇయాన్ మోర్గాన్ (2019)
22 – గ్లెన్ మాక్స్‌వెల్ (2023)
21 – ఎబి డివిలియర్స్ (2015)
21 (క్వింటన్ డి కాక్ 2023)
ఇరుజట్లు:
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్(కీపర్), మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








