AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ధోనీ తర్వాతే నా రిటైర్మెంట్.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన టీమిండియా ప్లేయర్

Piyush Chawla Key Statement On His Retirement: మాజీ టీం ఇండియా స్పిన్నర్ పీయూష్ చావ్లా తన రిటైర్మెంట్ గురించి చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. పృథ్వీ షా ఒకసారి రిటైర్మెంట్ గురించి తనతో ఒక ప్రశ్న అడిగాడని.. దానికి నేను సచిన్ టెండూల్కర్‌తో ఆడానని, అతని కొడుకుతో కూడా ఆడానని బదులిచ్చాను. ఇప్పుడు నీ కొడుకుతోనూ ఆడేసి అప్పుడు రిటైర్ అవుతాను అంటూ చెప్పి నవ్వులు పూయించానని తెలిపాడు.

Video: ధోనీ తర్వాతే నా రిటైర్మెంట్.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన టీమిండియా ప్లేయర్
Piyush Chawla
Venkata Chari
|

Updated on: Sep 14, 2024 | 8:30 AM

Share

Piyush Chawla Key Statement On His Retirement: మాజీ టీం ఇండియా స్పిన్నర్ పీయూష్ చావ్లా తన రిటైర్మెంట్ గురించి చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. పృథ్వీ షా ఒకసారి రిటైర్మెంట్ గురించి తనతో ఒక ప్రశ్న అడిగాడని.. దానికి నేను సచిన్ టెండూల్కర్‌తో ఆడానని, అతని కొడుకుతో కూడా ఆడానని బదులిచ్చాను. ఇప్పుడు నీ కొడుకుతోనూ ఆడేసి అప్పుడు రిటైర్ అవుతాను అంటూ చెప్పి నవ్వులు పూయించానని తెలిపాడు.

పీయూష్ చావ్లా గురించి మాట్లాడితే, అతని అంతర్జాతీయ కెరీర్ అంత ప్రత్యేకమైనది కాదు. అతను తన కెరీర్‌లో 3 టెస్టులు, 25 ODIలు, 7 T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను టెస్టులో 7, వన్డేల్లో 32, టీ20లో 4 వికెట్లు తీశాడు. 2006లో అరంగేట్రం చేసిన పీయూష్ చావ్లా డిసెంబర్ 2012లో ఇంగ్లండ్‌తో తన చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత టీమిండియా తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అతను 2011 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో భాగమయ్యాడు.

ఇవి కూడా చదవండి

రిటైర్మెంట్ గురించి పీయూష్ చావ్లా ఏమన్నాడంటే..

పీయూష్ చావ్లా అంతర్జాతీయ కెరీర్ చాలా కాలం క్రితం ముగిసినప్పటికీ, అతను ఇప్పటికీ ఐపీఎల్‌తో సహా ఇతర దేశవాళీ లీగ్‌లలో ఆడుతున్నాడు. చావ్లా వయసు 35 ఏళ్లు అయినప్పటికీ అతని ఫిట్‌నెస్‌పై పెద్దగా ప్రభావం పడలేదు. ఇటీవల శుభంకర్ మిశ్రా పోడ్‌కాస్ట్‌లో, ధోని ముందుగా రిటైర్ అవుతాడా లేదా మీరు రిటైర్ అవుతాడా అని పీయూష్ చావ్లాను ఓ ప్రశ్న అడిగాడు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఎంఎస్ ధోని ముందుగా రిటైర్ అవుతాడు. తర్వాత నేను రిటైర్ అవుతాను (నవ్వుతూ). కొంతకాలం క్రితం పృథ్వీ షా నాతో పీసీ భాయ్, రిటైర్మెంట్ ఎప్పుడు అన్నాడు. నేను సచిన్ టెండూల్కర్‌తో ఆడానని, అతని కొడుకుతో కూడా ఆడానని చెప్పాను. ఇప్పుడు నేను మీతో ఆడుతున్నాను. నీ కొడుకుతోనూ ఆడిన తర్వాత రిటైర్ అవుతాను అంటూ చెప్పానని నవ్వులు పూయించాడు.

ఐపీఎల్‌లో పీయూష్ చావ్లా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నప్పుడు అతను అద్భుత ప్రదర్శన చేశాడు. గత సీజన్‌లో కూడా అదే జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు అతను ఏ టీమ్‌కి వెళ్తాడు అనేది చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..