చాలా గ్యాప్ తర్వాత మళ్లీ కారెక్కనున్న కేసీఆర్.. తెలంగాణ భవన్‌కు గులాబీ బాస్..!
మళ్లీ యాక్టివ్ అవుతున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటివరకు ఒకే ఎత్తు ఇకనుంచి తెలంగాణ రాజకీయాల్లో మరో ఎత్తు అంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ వెరీ వెరీ స్పెషల్. ఆయన స్పీచ్‌కు లక్షల్లో వ్యూయర్స్ ఉంటారు. తెలంగాణ ఉద్యమం నుంచి ముఖ్యమంత్రి హోదా వరకు అన్ని పదవుల్లోనూ ఆయన స్టైల్ వేరు. అలాంటి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గత రెండేళ్లుగా సైలెంట్‌గా ఉండిపోయారు.

మళ్లీ యాక్టివ్ అవుతున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటివరకు ఒకే ఎత్తు ఇకనుంచి తెలంగాణ రాజకీయాల్లో మరో ఎత్తు అంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ వెరీ వెరీ స్పెషల్. ఆయన స్పీచ్‌కు లక్షల్లో వ్యూయర్స్ ఉంటారు. తెలంగాణ ఉద్యమం నుంచి ముఖ్యమంత్రి హోదా వరకు అన్ని పదవుల్లోనూ ఆయన స్టైల్ వేరు. అలాంటి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గత రెండేళ్లుగా సైలెంట్‌గా ఉండిపోయారు. కొంతమేరకు అనారోగ్య కారణాలైతే.. మరికొంత అనాసక్తి కూడా కారణం..!
ఈ ఏడాది మార్చి నెలలో చివరిసారిగా ఆయన పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ వచ్చారు. ఇక ప్రెస్ మీట్ పెట్టి ఏడాది దాటుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రెండేళ్లు సమయం ఇస్తానంటూ చెప్పిన కేసీఆర్, ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఎల్లుండి ఆదివారం (డిసెంబర్ 21) తెలంగాణ భవన్‌లో నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. పాలమూరు ప్రాజెక్ట్ నీటి కేటాయింపులపై ఉద్యమం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం గత రెండు రోజులుగా ఫామ్ హౌస్ లో నేతలతో చర్చలు జరుపుతున్నారు కేసీఆర్.
ఇప్పటికే కేసీఆర్ బయటకు రావాలి.. అసెంబ్లీలో చర్చల్లో పాల్గొనాలి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే సెటైర్లు వేస్తున్నారు. పాలమూరు నీటి కేటాయింపుల విషయంలోనూ కేంద్రానికి రెండు పార్టీలు లేఖ రాద్దాం.. అసెంబ్లీలో చర్చిద్దాం.. రమ్మంటూ వెల్‌కమ్ కూడా చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ ఎల్లుండి తెలంగాణ భవన్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? నీటి వాటాల విషయంలో మరో ఉద్యమానికి తెర తీస్తారా? అనేది ఆసక్తిగా మారింది. మీటింగ్ తర్వాత ప్రెస్ మీట్ పెడతారా..? ప్రెస్ మీట్ లో ఎలాంటి మాటలు మాట్లాడతారు? ఎలాంటి ప్రకటనలు చేస్తారనేది కూడా వెరీ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. ఇక వీటన్నిటితో పాటు రాజకీయ అంశాలు మాట్లాడాల్సి వస్తే, కవితపై కూడా స్పందిస్తారనేది పార్టీలో చర్చ జరుగుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




