Team India: నళ్ల కళ్లద్దాలతో స్టైల్‌గా బరిలోకి.. కట్‌చేస్తే.. జీరోకే ఔట్.. టీమిండియా ప్లేయర్‌ను ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్

Shreyas Iyer Video Viral: శ్రేయాస్ అయ్యర్‌కు చాలా బ్యాడ్ టైం నడుస్తోంది. మొదట, అతను దులీప్ ట్రోఫీ మొదటి మ్యాచ్‌లో ఫ్లాప్ అయ్యాడు. ఆ తరువాత, అతను బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు టీమిండియాలో ఎంపిక కాలేదు. ఇప్పుడు ఈ ఆటగాడు దులీప్ ట్రోఫీ రెండవ మ్యాచ్‌లో కూడా ఘోరంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో వైఫల్యం కావడంతో ట్రోల్స్ మొదలయ్యాయి.

Team India: నళ్ల కళ్లద్దాలతో స్టైల్‌గా బరిలోకి.. కట్‌చేస్తే.. జీరోకే ఔట్.. టీమిండియా ప్లేయర్‌ను ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్
Shreyas Iyer Video Viral
Follow us
Venkata Chari

|

Updated on: Sep 13, 2024 | 9:04 PM

Shreyas Iyer Video Viral: శ్రేయాస్ అయ్యర్‌కు చాలా బ్యాడ్ టైం నడుస్తోంది. మొదట, అతను దులీప్ ట్రోఫీ మొదటి మ్యాచ్‌లో ఫ్లాప్ అయ్యాడు. ఆ తరువాత, అతను బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు టీమిండియాలో ఎంపిక కాలేదు. ఇప్పుడు ఈ ఆటగాడు దులీప్ ట్రోఫీ రెండవ మ్యాచ్‌లో కూడా ఘోరంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో వైఫల్యం కావడంతో ట్రోల్స్ మొదలయ్యాయి. శ్రేయాస్ అయ్యర్‌ని ఎగతాళి చేయడానికి కారణం అతను జీరోకే అవుట్ అయినందుకు మాత్రంకాదండోయ్. అతని స్టైల్‌కు సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాడు. నిజానికి, అయ్యర్ మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు, అతను బ్లాక్ అద్దాలు ధరించాడు. అయ్యర్‌ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎంతో స్టైలీష్‌గా బరిలోకి దిగిన అయ్యర్ 7వ బంతికే జీరో వద్ద ఔటయ్యాడు.

బ్లాక్ కళ్లద్దాలపై ట్రోల్స్..

శ్రేయాస్ అయ్యర్‌ను ఖలీల్ అహ్మద్ అవుట్ చేశాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ క్యాచ్ అవుట్ చేశాడు. అయ్యర్ ఔట్ అయిన తర్వాత అతడిని ట్రోల్స్ చేస్తున్నారు. బ్లాక్ కళ్లద్దాలు పెట్టుకుని బ్యాటింగ్ చేయడం సరైంది కాదని అభిమానులు భావించారు. కళ్లద్దాలు పెట్టుకోవాల్సిన దిశలో సూర్యుడు లేడని కొందరు అభిమానులు ఆరోపించారు. దీంతో అభిమానులు అయ్యర్‌ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. కానీ, శ్రేయాస్ అయ్యర్ ఇలా అవుట్ కావడం అతనికి అస్సలు మంచిది కాదు. ఇండియా సితో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేసిన తర్వాత అయ్యర్ కూడా ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించినా, టీమిండియాలో పునరాగమనం చేయాలంటే అయ్యర్ నిలకడగా రాణించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

విశాఖపట్నం టెస్టు తర్వాత ఔట్..

శ్రేయాస్ అయ్యర్ టెస్ట్ కెరీర్ గురించి మాట్లాడితే, అతను ఈ సంవత్సరం ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడాడు. విశాఖపట్నం టెస్టు తర్వాత అతడిని టీమిండియా నుంచి తప్పించారు. అయ్యర్ ఇప్పటివరకు 14 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీల ఆధారంగా 811 పరుగులు చేశాడు. ఇప్పుడు అయ్యర్ లాంగ్ ఫార్మాట్‌లో ఎప్పుడు తిరిగి వస్తాడో చూడాలి. టీం ఇండియా ఇంకా న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఏడాది చివరిలో ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లోకి తిరిగి రావడమే అయ్యర్ లక్ష్యం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..