నాడు కోహ్లీకి కెప్టెన్‌గా.. నేడు పొలిటికల్ లీడర్‌గా.. ఆ రీజన్‌తో క్రికెట్ నుంచి యూ టర్న్.. ఎవరో తెలుసా?
Tejashwi Yadav and Virat Kohli: బీహార్ రాజకీయాల్లోకి రాకముందు, మాజీ కేంద్ర మంత్రి లాలూ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ కూడా క్రికెట్‌లో కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాలని ఆశపడ్డాడు. కొన్నేళ్లు ప్రొఫెషనల్ క్రికెట్‌లో చురుకుగా ఉన్నాడు. కానీ, ఢిల్లీలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో, అతను జార్ఖండ్‌కు వెళ్లాడు. ఆ తర్వాత కొన్ని అనూహ్య కారణాలతో కెరీర్‌కు సవ్వస్తి చెప్పాల్సి వచ్చింది.
Tejashwi Yadav and Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లికి, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు మధ్య క్రికెట్ కనెక్షన్ ఉంది. దాని గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ సంబంధాన్ని ఇప్పుడు తేజస్వి యాదవ్ స్వయంగా వెల్లడించారు. రాజకీయాల్లోకి రాకముందు తేజస్వి కూడా క్రికెటర్ అని, ఐపీఎల్‌లో కూడా ఆడాడని చాలా తక్కువమందికి తెలుసు. ఒకప్పుడు విరాట్ కోహ్లీ కూడా తన కెప్టెన్సీలోనే ఆడానని తేజస్వి వెల్లడించడం గమనార్హం.
తేజస్వి యాదవ్ తండ్రి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ యాదవ్ కేంద్ర ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు, తేజస్వి క్రికెట్ కెరీర్ కూడా అదే సమయంలో ప్రారంభమైంది. ఆ తర్వాత తేజస్వి యాదవ్ ఢిల్లీ క్రికెట్‌లోకి ప్రవేశించాడు. 2008లో, అతను IPL మొదటి సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌లో కూడా భాగమయ్యాడు. అతని క్రికెట్ కెరీర్ 2010లోనే ముగిసినప్పటికీ, ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించాడు.
తేజస్వి విరాట్‌కు కెప్టెన్‌గా..
34 ఏళ్ల తేజస్వి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన క్రికెట్ కెరీర్ గురించి మాట్లాడాడు. తాను కూడా క్రికెటర్ అనే వాస్తవం గురించి ఎవరూ మాట్లాడరంటూ ధాటిగా చెప్పుకొచ్చాడు. కోహ్లితో తనకున్న అనుబంధం గురించి తేజస్వి తన ఢిల్లీ క్రికెట్ రోజుల్లో కోహ్లీకి కెప్టెన్‌గా కూడా ఉండేవాడినని చెప్పాడు. వాస్తవానికి, వీరిద్దరూ ఢిల్లీ అండర్ -15, అండర్ -19 జట్లలో కలిసి క్రికెట్ ఆడారు. ఆ సమయంలో, తేజస్వి కొంతకాలం జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. విరాట్‌తో తన పాత ఫొటోను పంచుకోవడం ద్వారా తేజస్వి 10 సంవత్సరాల క్రితం ఒక ట్వీట్‌లో కూడా దీని గురించి వెల్లడించాడు.
అందువల్లే క్రికెట్‌కు దూరమవ్వాల్సి వచ్చింది..
I kw @imVkohli Virat since Uder-15 days,has played lot wth him,very determinant & confident guy,wud bounce bck surely pic.twitter.com/AeUcCl4kyn
— Tejashwi Yadav (@yadavtejashwi) October 10, 2014
అయితే, తేజస్వికి ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లేక ఢిల్లీ సీనియర్ క్రికెట్ జట్టులో అవకాశం రాలేదు. ఆ తరువాత, అతను జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్‌లో చేరాడు. దీని కోసం అతను మూడు ఫార్మాట్లలో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతని బ్యాట్ నుంచి కేవలం 37 పరుగులు మాత్రమే వచ్చాయి. తన రెండు మోకాళ్లు గాయపడటం వల్ల తన క్రికెటర్ కెరీర్ పెద్దగా పురోగమించలేదని, ఆ తర్వాత క్రికెట్‌ను విడిచిపెట్టాల్సి వచ్చిందని తేజస్వి చెప్పుకొచ్చాడు. అతను 2010లో తన చివరి మ్యాచ్ ఆడాడు. అందులో అతను 5 పరుగులు చేసి 1 వికెట్ తీసుకున్నాడు.
క్రికెట్‌ను విడిచిపెట్టినప్పటి నుంచి, తేజస్వి బీహార్ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. తండ్రి లాలూ, తల్లి రబ్రీ దేవి తర్వాత పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ అతిపెద్ద నాయకుడిగా ఎదిగారు. ఈ కాలంలో, అతను బీహార్‌లో అతి పిన్న వయస్కుడైన ఉప ముఖ్యమంత్రి, అసెంబ్లీలో అతి పిన్న వయస్కుడైన ప్రతిపక్ష నాయకుడు కూడా అయ్యాడు. వచ్చే ఏడాది బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఆయన మళ్లీ తన పార్టీకి నాయకత్వం వహించేందుకు సిద్ధమయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..