AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi : సెంచరీ కొట్టిన కాసేపటికే వైభవ్ సూర్యవంశీకి గాయం.. ఐపీఎల్ నుంచి ఔట్

Vaibhav Suryavanshi : జోఫ్రా ఆర్చర్ వేసిన ఓవర్ పిచ్ బంతిని ఇషాన్ కిషన్ కవర్స్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఆ బంతిని అడ్డుకోవడానికి సర్కిల్ లోపల ఉన్న వైభవ్ సూర్యవంశీ వెనక్కి పరిగెత్తాడు. అయితే బంతిని వెంబడిస్తున్న క్రమంలో ఒక్కసారిగా అతనికి హామ్‌స్ట్రింగ్ పట్టేసింది.

Vaibhav Suryavanshi : సెంచరీ కొట్టిన కాసేపటికే వైభవ్ సూర్యవంశీకి గాయం.. ఐపీఎల్ నుంచి ఔట్
Vaibhav Suryavanshi
Rakesh
|

Updated on: Apr 26, 2026 | 6:49 AM

Share

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఒకే రోజు రెండు విభిన్నమైన అనుభూతులను ఎదుర్కొన్నాడు. ఒకవైపు బ్యాట్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీతో చరిత్ర సృష్టిస్తే.. మరోవైపు ఫీల్డింగ్ చేస్తూ తీవ్ర గాయంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ గాయపడిన తీరు చూసి అటు రాజస్థాన్ టీమ్ మేనేజ్‌మెంట్, ఇటు అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అతను ఆరెంజ్ క్యాప్ రేసులో ఉండటంతో, ఈ గాయం అతని తదుపరి మ్యాచులపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న టెన్షన్ నెలకొంది.

హైదరాబాద్ ఇన్నింగ్స్ సమయంలో మూడో ఓవర్‌లో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. జోఫ్రా ఆర్చర్ వేసిన ఓవర్ పిచ్ బంతిని ఇషాన్ కిషన్ కవర్స్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఆ బంతిని అడ్డుకోవడానికి సర్కిల్ లోపల ఉన్న వైభవ్ సూర్యవంశీ వెనక్కి పరిగెత్తాడు. అయితే బంతిని వెంబడిస్తున్న క్రమంలో ఒక్కసారిగా అతనికి హామ్‌స్ట్రింగ్ పట్టేసింది. వెంటనే నడవలేక మైదానంలోనే కూలబడిపోయాడు.

వైభవ్ ఇబ్బంది పడటం చూసి వెంటనే ఫిజియోలు మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. కానీ నొప్పి తీవ్రంగా ఉండటంతో అతను లేచి నడవలేకపోయాడు. కనీసం అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఇబ్బంది పడటంతో, సపోర్ట్ స్టాఫ్ అతనిని భుజాల మీద మోసుకుంటూ మైదానం వెలుపలికి తీసుకెళ్లారు. అది చూసిన జైపూర్ ప్రేక్షకులు ఒక్కసారిగా మూగబోయారు. సెంచరీ హీరో ఇలా వెళ్లడం ఎవరికీ నచ్చలేదు.

ఈ గాయానికి ముందే వైభవ్ తన బ్యాటింగ్ తో స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. కేవలం 37 బంతుల్లోనే 103 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో 12 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. తన టీనేజ్ ప్రాయంలోనే ఇలాంటి ప్రదర్శన చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతను, 278 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం సృష్టించాడు. అతని ఇన్నింగ్స్ వల్లే రాజస్థాన్ 228 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది.

వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ఐపీఎల్ 2026లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో (ఆరెంజ్ క్యాప్) అగ్రస్థానంలో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే అతని సేవలు చాలా అవసరం. ఒకవేళ ఈ హామ్‌స్ట్రింగ్ గాయం తీవ్రమైనది అయితే, అతను కనీసం 2-3 వారాల పాటు ఆటకు దూరం కావాల్సి ఉంటుంది. దీంతో రాజస్థాన్ మేనేజ్‌మెంట్ ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతోంది. వైభవ్ త్వరగా కోలుకోవాలని క్రికెట్ దిగ్గజాలు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us