AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: ఇదెక్కడి దరిద్రం.. ముచ్చటగా మూడు సెంచరీలు వృథా!

ఐపీఎల్‌ 2026 పరుగుల వరదతో పోటెత్తుతోంది. గత రెండు రోజుల్లో మూడు సెంచరీలు నమోదైనా, విచిత్రంగా ఆ మూడు మ్యాచ్‌లలోనూ శతకాలు చేసిన జట్టు ఓటమి పాలైంది. సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్, వైభవ్ సూర్యవంశీ శతకాలు వృధా అయ్యాయి. భారీ స్కోర్లు చేసినా విజయాలు అందని ఈ వింత పోకడ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

IPL 2026: ఇదెక్కడి దరిద్రం.. ముచ్చటగా మూడు సెంచరీలు వృథా!
Sai Sudarshan Kl Rahul Sury
SN Pasha
|

Updated on: Apr 26, 2026 | 6:00 AM

Share

ఐపీఎల్‌ 2026లో పరుగుల వరద పారుతోంది. దాంతో పాటు సెంచరీల మోత మోగిపోతోంది. శుక్రవారం, శనివారం రెండు రోజుల్లో మొత్తం మూడు మ్యాచ్‌లు జరిగితే మూడు మ్యాచ్‌ల్లోనూ ఒక్కో సెంచరీ నమోదైంది. పైగా తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న జట్లలోని ఆటగాళ్లే సెంచరీలు బాదేశారు. కానీ విచిత్రం ఏంటంటే.. ఆ మూడు మ్యాచ్‌ల్లోనూ ఏ జట్టు నుంచి అయితే సెంచరీ వచ్చిందో ఆ జట్టే ఓడిపోయింది.

శుక్రవారం గుజరాత్‌ టైటాన్స్‌ వర్సెస్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జీటీ నుంచి ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ అద్భుతమైన సెంచరీ సాధించాడు. 58 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సులతో 100 పరుగులు సాధించాడు. కానీ, మ్యాచ్‌ మాత్రం ఆర్సీబీనే గెలిచింది. విరాట్‌ కోహ్లీ 81 పరుగులు మాత్రమే చేసినా.. ఆ జట్టులోని మిగతా ఆటగాళ్లు కూడా రాణించడంతో ఆర్సీబీ ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

ఇక శనివారం మధ్యాహ్నాం పంజాబ్‌ కింగ్స​్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదు అయ్యాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నుంచి కేఎల్‌ రాహుల్‌ ఏకంగా 152 పరుగుల సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. కానీ, ఏం లాభం 265 పరుగుల టార్గెట్‌ను కూడా పంజాబ్‌ కింగ్స్‌ ఊదిపారేసింది. ఇదే శనివారం రాత్రి రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్‌ఆర్‌ 228 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అందుకు వైభవ్‌ సూర్యవన్షీ సూపర్‌ సెంచరీనే కారణం. కేవలం 37 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్సులతో 103 పరుగులు సాధించాడు. అయినా కూడా సన్‌రైజర్స్‌ విజయాన్ని సాధించింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో ఇసాన్‌ కిషన్‌, అభిషేక్‌ శర్మ హాఫ్‌ సెంచరీలు సాధించి జట్టును గెలిపించారు. ఇలా వరుసగా మూడు మ్యాచ్‌ల్లో నమోదైన మూడు సెంచరీలు కూడా వృథా అయ్యాయి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us