Gautam Gambhir: గంభీర్ కోచ్‌గా వస్తే టీమిండియా నుంచి ఆ సీనియర్ ఆటగాళ్లు ఔట్! లిస్టులో కోహ్లీ కూడా!
గంభీర్ మెంటార్‌షిప్‌లో కేకేఆర్ ఈసారి చాంపియన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీని తర్వాత గౌతమ్ గంభీర్‌ను టీమిండియా కోచ్‌గా నియమించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి సంబంధించి బీసీసీఐ, గంభీర్ మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరిందని, అధికారిక ప్రకటన మాత్రమే పెండింగ్ లో ఉందని సమాచారం
ఐపీఎల్ సీజన్-17లో కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా గౌతమ్ గంభీర్ కనిపించాడు. విశేషమేమిటంటే.. గంభీర్ మెంటార్‌షిప్‌లో కేకేఆర్ ఈసారి చాంపియన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీని తర్వాత గౌతమ్ గంభీర్‌ను టీమిండియా కోచ్‌గా నియమించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి సంబంధించి బీసీసీఐ, గంభీర్ మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరిందని, అధికారిక ప్రకటన మాత్రమే పెండింగ్ లో ఉందని సమాచారం. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఈ టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది. దీని తర్వాత గౌతమ్ గంభీర్ భారత జట్టు హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా గంభీర్ రాకతో భారత టీ20 జట్టుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దూరమవుతారని సమాచారం. అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఇదే చివరి అవకాశం. ఈ టీ20 ప్రపంచకప్‌తో ఇద్దరు ఆటగాళ్ల టీ20 అంతర్జాతీయ కెరీర్‌కు తెరపడనుందని సమాచారం. దీని తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను భారత టీ20 జట్టు ఎంపికకు పరిగణనలోకి తీసుకోరని తెలిసింది.
దీనికి తోడు గౌతమ్ గంభీర్ ముందుగా కొత్త టీ20 జట్టును కూడా రూపొందించాలనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ నాయకుడెవరు అనే విషయంలో స్పష్టత లేదు. ఇలా రోహిత్ శర్మ నిష్క్రమణ తర్వాత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరన్న చర్చ మళ్లీ తెరపైకి వస్తుంది. గౌతీ రాకతో భారత జట్టులో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకోనున్నాయని ప్రచారం నడుస్తోంది. ఈ మార్పుతో 37 ఏళ్ల రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ ముగుస్తుందా? లేక వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీ వరకు కెప్టెన్‌గా కొనసాగుతారా అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే గౌతమ్ గంభీర్ 2027 వరకు భారత జట్టుకు కోచ్‌గా ఉంటాడు. మధ్యలో 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2026లో టీ20 ప్రపంచకప్, 2027లో వన్డే ప్రపంచకప్ ఉంటాయి. ఈ మూడు టోర్నీలను దృష్టిలో ఉంచుకుని భారత జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గంభీర్ ఎంట్రీతో రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
న్యూయార్క్ లో టీమిండియా ఆటగాళ్ల ప్రాక్టీస్.. వీడియో
📍 New York
Bright weather ☀️, good vibes 🤗 and some foot volley ⚽️
Soham Desai, Strength & Conditioning Coach gives a glimpse of #TeamIndia‘s light running session 👌👌#T20WorldCup pic.twitter.com/QXWldwL3qu
— BCCI (@BCCI) May 29, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..