AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: గౌతమ్ గంభీర్‌కు ఇచ్చిపడేసిన ఫ్యాన్స్.. స్టేడియం బయట చుట్టుముట్టి.. ఏం చేశారంటే..?

We Want Sanju Samson: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం, మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ వెనుకబడింది. సిరీస్‌ను కనీసం సమం చేయాలన్నా తదుపరి మ్యాచ్‌ల్లో టీమిండియా అద్భుతాలు చేయాల్సి ఉంటుంది.

Video: గౌతమ్ గంభీర్‌కు ఇచ్చిపడేసిన ఫ్యాన్స్.. స్టేడియం బయట చుట్టుముట్టి.. ఏం చేశారంటే..?
Gautam Gambhir Vs Sanju Samson
Venkata Chari
|

Updated on: Jul 08, 2026 | 12:10 PM

Share

We Want Sanju Samson: భారత క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలు అభిమానుల్లో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైన తర్వాత, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఊహించని షాక్ తగిలింది. స్టేడియం వెలుపల అభిమానులు గంభీర్‌ను చుట్టుముట్టి, కేరళ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ కోసం గట్టిగా నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు.

ఘోర పరాజయం.. అభిమానుల ఆగ్రహం

ఇంగ్లండ్‌ పర్యటనలో భారత జట్టు ఆటతీరు రోజురోజుకూ దిగజారుతోంది. మూడవ టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 76 పరుగులకే కుప్పకూలింది. ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడాన్ని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘోర పరాజయం తర్వాత జట్టు ఎంపికపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: ఏమిరా శ్రేయాస్.. టీమిండియా హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డు.. పరువు తీసేశావుగా..!

సంజూ శాంసన్‌ను పక్కన పెట్టడమే వివాదానికి కారణం..

వరుసగా విఫలమవుతున్నాడనే నెపంతో సంజూ శాంసన్‌ను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించి, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి గంభీర్ అవకాశం ఇచ్చాడు. ఐపీఎల్‌లో అదరగొట్టిన సూర్యవంశీ అంతర్జాతీయ వేదికపై మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో అతను కేవలం 13 పరుగులు మాత్రమే చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. శాంసన్‌ స్థానంలో వచ్చిన ఆటగాడు కూడా నిరాశపరచడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

‘మాకు సంజూ కావాలి’.. గంభీర్ ముఖం చాటేసిన వేళ..

మ్యాచ్ ముగిసిన తర్వాత నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియం వెలుపల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోచ్ గౌతమ్ గంభీర్, ఆటగాడు తిలక్ వర్మలతో కలిసి జట్టు బస్సు వైపు వెళ్తుండగా, అక్కడ గుమిగూడిన వందలాది మంది అభిమానులు ఒక్కసారిగా గంభీర్‌ వైపు వేళ్లు చూపిస్తూ నిలదీశారు. “మాకు సంజూ శాంసన్ కావాలి” అంటూ స్టేడియం మార్మోగిపోయేలా నినాదాలు చేశారు. ఈ ఊహించని ప్రజా ఆగ్రహంతో షాక్‌కు గురైన గౌతమ్ గంభీర్, తిలక్ వర్మలు తలదించుకుని, ముఖాలు చాటేస్తూ వేగంగా బస్సులోకి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో దావానలంలా వ్యాపిస్తున్నాయి.

శాంసన్‌పై తలుపులు మూయలేదు: కోచ్ వివరణ

అభిమానుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో గంభీర్ మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో స్పందించాడు. సంజూ శాంసన్ కోసం జట్టు తలుపులు పూర్తిగా మూసుకుపోలేదని స్పష్టం చేశాడు. క్రికెట్‌లో ఎవరైనా సరే తమ ప్రతిభతోనే జట్టులో స్థానాన్ని సంపాదించుకోవాలని, ఇందుకు ఎలాంటి మినహాయింపులు ఉండవని తెలిపాడు. జింబాబ్వే పర్యటనకు కూడా శాంసన్‌కు విశ్రాంతి ఇచ్చినందున, ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లలో అతను ఆడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఆసియా క్రీడల రేసులో సంజూ ఉన్నట్లు బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి.

ఇది కూడా చదవండి: టాస్‌లో హీరో.. మ్యాచ్‌లో జీరో.. టీమిండియా పాలిట విలన్‌లా మారిన శ్రేయాస్ అయ్యర్..!

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం, మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ వెనుకబడింది. సిరీస్‌ను కనీసం సమం చేయాలన్నా తదుపరి మ్యాచ్‌ల్లో టీమిండియా అద్భుతాలు చేయాల్సి ఉంటుంది. ప్రయోగాల పేరుతో సీనియర్లను పక్కనబెట్టి చేతులు కాల్చుకుంటున్న మేనేజ్‌మెంట్, రాబోయే మ్యాచ్‌ల్లోనైనా సరైన వ్యూహాలతో బరిలోకి దిగుతుందో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us