AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: టీమిండియాలో తీవ్ర కలకలం.. నన్నెందుకు తప్పించారంటూ గంభీర్‌ని నిలదీసిన శాంసన్..?

Sanju Samson Gautam Gambhir Argument: మైదానంలో ప్రత్యర్థులను ఢీకొట్టాల్సిన సమయంలో జట్టులోనే ఇలాంటి విభేదాలు తలెత్తడం భారత క్రికెట్‌కు ఏమాత్రం మంచిది కాదు. టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఈ ఉద్రిక్తతలను చల్లార్చి, జట్టును విజయపథంలో నడిపిస్తాడో లేదో చూడాలి.

Video: టీమిండియాలో తీవ్ర కలకలం.. నన్నెందుకు తప్పించారంటూ గంభీర్‌ని నిలదీసిన శాంసన్..?
Sanju Samson Gautam Gambhir Argument
Venkata Chari
|

Updated on: Jul 07, 2026 | 12:15 PM

Share

Sanju Samson Gautam Gambhir Argument: భారత క్రికెట్ జట్టులో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక టీ20 సిరీస్ మధ్యలో చోటు చేసుకున్న ఒక ఊహించని పరిణామం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. జట్టులో స్థానం దక్కకపోవడంపై స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు వస్తున్న వార్తలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.

డ్రెస్సింగ్ రూమ్‌లో ముదిరిన వివాదం.. అసలేం జరిగింది?

ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా భారత యువ జట్టు వరుస సవాళ్లు ఎదుర్కొంటోంది. మొదటి మ్యాచ్ రద్దవ్వడం, రెండో పోరులో పరాజయం పాలవడంతో జట్టుపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఇలాంటి కీలక సమయంలో జట్టును విజయతీరాలకు చేర్చగల సత్తా ఉన్న సంజు శాంసన్‌ను వరుసగా పక్కన పెట్టడం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. వరుసగా లభిస్తున్న అవకాశాలను ఇతర ఆటగాళ్లు చేజార్చుకుంటున్నా, తనను ఎందుకు తుది జట్టులోకి తీసుకోవడం లేదంటూ సంజు శాంసన్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను నేరుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Team India: అయ్యర్‌కు డేంజర్ బెల్.. 3 ఛాన్స్‌ల్లో ఒకటి ఫెయిల్.. కొత్త కెప్టెన్ రెడీ చేసిన బీసీసీఐ..?

ప్రతిభ ఉన్నా తప్పని నిరీక్షణ.. అభిమానుల ఆగ్రహం..

సంజు శాంసన్ ప్రతిభపై ఎవరికీ ఎటువంటి సందేహాలు లేవు. క్రీజులోకి వస్తే ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల సత్తా అతడి సొంతం. అయినప్పటికీ ప్రతి సిరీస్‌లోనూ అతడికి ఏదో ఒక కారణంతో నిరాశే ఎదురవుతోంది. కేవలం బెంచ్‌కే పరిమితం చేయడంపై సంజు తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఇదే విషయమై మేనేజ్మెంట్ తీరును తప్పుబడుతూ కోచ్‌తో మాట్లాడగా, అది కాస్తా వాగ్వాదానికి దారితీసిందని ఇన్‌సైడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో శాంసన్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కోచ్ గంభీర్, మేనేజ్మెంట్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు.

మూడో టీ20 ముందు హైడ్రామా.. తుది జట్టుపై ప్రభావం?

ఇంగ్లాండ్‌తో ఈరోజు జరగబోయే మూడో టీ20 మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకం. ఇందులో గెలిస్తేనే సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇలాంటి చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌కు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలాంటి గొడవలు జరగడం జట్టు మనోధైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన కొందరు ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి, మూడో మ్యాచ్‌లో సంజు శాంసన్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించుతారని నిన్నటివరకు ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుత సమీకరణాలు చూస్తుంటే ఈ వివాదం కారణంగా అతడికి అసలు అవకాశం దక్కుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: IND vs ENG: అగ్నిపరీక్షకు సిద్ధమైన కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్.. 3వ టీ20లో ఆ స్టార్ ప్లేయర్‌పై వేటు?

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కొత్త ప్రయోగాలు..

మరోవైపు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మూడో మ్యాచ్ కోసం సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నాడు. ఒకవేళ సంజు శాంసన్ వివాదం సర్దుమణిగితే, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో కలిసి శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే కోచ్, సీనియర్ ఆటగాడి మధ్య నడుస్తున్న ఈ అంతర్గత పోరును మేనేజ్మెంట్ ఎలా సర్దుబాటు చేస్తుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్..యూట్యూబ్‌ను ఊపేస్తోన్న కొత్త సినిమా పాట
పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్..యూట్యూబ్‌ను ఊపేస్తోన్న కొత్త సినిమా పాట
మక్క గారెలు ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే..
మక్క గారెలు ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే..
మిథున రాశిలోకి కుజుడు.. వారి జీవితాల్లో తిరుగులేని విజయాలు
మిథున రాశిలోకి కుజుడు.. వారి జీవితాల్లో తిరుగులేని విజయాలు
డిగ్రీ పూర్తి చేశారా? ISROలో ఉద్యోగం పొందే అవకాశం..
డిగ్రీ పూర్తి చేశారా? ISROలో ఉద్యోగం పొందే అవకాశం..
వరకట్న దాహానికి మరో వివాహిత బలి!
వరకట్న దాహానికి మరో వివాహిత బలి!
చిప్స్ ప్యాకెట్లో ఉండే గాలిలో ఇంత కథ ఉందా.. అసలేం వాడతారో తెలుసా?
చిప్స్ ప్యాకెట్లో ఉండే గాలిలో ఇంత కథ ఉందా.. అసలేం వాడతారో తెలుసా?
ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు: రఘు కుంచె
ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు: రఘు కుంచె
ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో భక్తులు నేలపైనే ప్రసాదం ఎందుకు తింటారు?..
ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో భక్తులు నేలపైనే ప్రసాదం ఎందుకు తింటారు?..
మా పెద్దిని కాపాడండి: ​వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్
మా పెద్దిని కాపాడండి: ​వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్
వానాకాలంలో గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే.. చాలా వరకు ఆదా చేయవచ్చు!
వానాకాలంలో గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే.. చాలా వరకు ఆదా చేయవచ్చు!