AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor: ఐఐటీ ఖరగ్ పూర్‌లో చదువు.. కార్పొరేట్ జాబ్.. ఇప్పుడేమో 270 కోట్ల సినిమాతో సంచలనం.. ఈ హీరో ఎవరో తెలుసా?

ప్రతిష్ఠాత్మక ఐఐటీ ఖరగ్ పూర్ లో చదివాడు. తన ట్యాలెంట్ తో కార్పొరేట్ కంపెనీలో జాబ్ సంపాదించాడు. అయితే నటనపై ఆసక్తితో కోట్ల రూపాయల జీతమొచ్చే జాబ్ ను వదిలేశాడు.. కట్ చేస్తే.. ఇప్పుడు రూ. 270 కోట్ల సినిమాతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు.

Actor: ఐఐటీ ఖరగ్ పూర్‌లో చదువు.. కార్పొరేట్ జాబ్.. ఇప్పుడేమో 270 కోట్ల సినిమాతో సంచలనం.. ఈ హీరో ఎవరో తెలుసా?
Bollywood Actor
Basha Shek
|

Updated on: Sep 29, 2026 | 6:44 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఎదిగిన స్టార్స్ కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వీరు ఎలాంటి గాడ్ ఫాదర్ అండ లేకుండా కేవలం సొంత ట్యాలెంట్, కష్టంతో స్టార్స్ గా ఎదిగారు. అలాంటి వారిలో ఈ యంగ్ హీరో కూడా ఒకరు. అయితే సినిమాల్లోకి రాక ముందు ఇతనిది లగ్జరీ లైఫ్. చదువులో చురుకు కావడంతో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించారు. వారి కష్టాన్ని వమ్ము చేయకుండా ఇతను కష్టపడి చదివాడు. ప్రతిష్ఠాత్మక ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువు పూర్తి చేశాడు. కార్పొరేట్ కంపెనీలో కొలువు కూడా సంపాదించాడు. అయితే నటనపై ఇంట్రెస్ట్ ఉండడంతో లగ్జరీ జాబ్ ను వదిలేసి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ ఇండస్ట్రీలోనే టాప్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు. అతనే జీతూ భయ్యా అలియాస్ జితేంద్ర కుమార్. ఇప్పటికే తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ నటుడు ఇటీవల రిలీజైన ‘మిర్జాపూర్: ది మూవీ’తో మరోసారి వైరల్ అవుతున్నాడు. ఇందులో జితేంద్ర పోషించిన ‘బబ్లూ పండిత్ పాత్రకు మంచి పేరు వస్తోంది. అంతకు ముందు ‘పర్మనెంట్ రూమ్‌మేట్స్’, ‘పిచర్స్’, ‘కోటా ఫ్యాక్టరీ’, ‘పంచాయత్’ వంటి వెబ్ సిరీస్ లతో బాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.

కాగా చదువులో చురుకుగా ఉన్నప్పటికీ చిన్నప్పటి నుంచే నాటకాలు వేశాడు జితేంద్ర కుమార్. ఇక ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చేరాక నటనపై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. కాలేజీ తర్వాత మంచి కార్పొరేట్ ఉద్యోగం వచ్చినా నటన మీద పిచ్చితో, చేతినిండా జీతం వచ్చే ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు జితేంద్ర కుమార్. మొదట ‘ది వైరల్ ఫీవర్’ (TVF)లో చేరి కొన్ని వీడియోస్ చేశాడు. కానీ వీటికి పెద్దగా స్పందన రాలేదు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు జితేంద్ర. దీంతో తీవ్ర నిరాశకు లోనై మళ్లీ బెంగళూరు వెళ్లి ఒక కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేశాడు. కానీ ఆ పనిలో అతనికి ఆత్మ సంతృప్తి దొరకలేదు. అయితే 2013లో ‘Munna Jazbaati: The Q-tiya Intern’ అనే వీడియో సూపర్ హిట్ అయింది. జితేంద్రకు కూడా మంచి గుర్తింపు వచ్చింది.

ఇవి కూడా చదవండి

‘మిర్జాపూర్: ది మూవీ’ ప్రమోషన్లలో జితేంద్ర కుమార్..

ఇలా పాపులర్ వీడియోలతో ఫేమస్ అయిన జితేంద్ర ఆ తర్వాత వెబ్ సిరీస్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 2015లో వచ్చిన ‘TVF Pitchers’ జితేంద్ర కెరీర్‌కు మరో పెద్ద టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఇందులో అతను పోషించిన జితూ మహేశ్వరి పాత్రకు మంచి పేరొచ్చింది. అలాగే కోటా ఫ్యాక్టరీ, ‘పర్మనెంట్ రూమ్‌మేట్స్’, ‘పిచర్స్’, ‘ పంచాయత్’ వెబ్ సిరీస్ లతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు జితేంద్ర. ఇక రీసెంట్ గా ‘మిర్జాపూర్’ వెబ్ సిరీస్ ఆధారంగా తీసిన ‘మిర్జాపూర్: ది మూవీ’లో ఆయన బబ్లూ పండిత్ పాత్రలో అద్భుతంగా నటించాడు జితేంద్ర. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 270 కోట్లకు పైగా వసూలు చేసింది.

View this post on Instagram

A post shared by Jitendra Kumar (@jitendrak1)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఐఐటీ ఖరగ్ పూర్‌లో చదువు.. కార్పొరేట్ జాబ్.. ఇప్పుడేమో క్రేజీ హీరో
ఐఐటీ ఖరగ్ పూర్‌లో చదువు.. కార్పొరేట్ జాబ్.. ఇప్పుడేమో క్రేజీ హీరో
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
లైసెన్స్ కావాలంటే.. ఏఐని మెప్పించాల్సిందే.. ఇకపై టెస్ట్ పాస్..
లైసెన్స్ కావాలంటే.. ఏఐని మెప్పించాల్సిందే.. ఇకపై టెస్ట్ పాస్..
అల్లరి నరేష్ ఫ్యామిలీని చూశారా? కూతురు ఎంత క్యూట్‌గా ఉందో! ఫొటోస్
అల్లరి నరేష్ ఫ్యామిలీని చూశారా? కూతురు ఎంత క్యూట్‌గా ఉందో! ఫొటోస్
సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడా?
సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడా?
గుండెకు ముప్పు తెచ్చే వంటగది అలవాట్లు ఇవే.. రోజూ చేసే ఈ తప్పులు..
గుండెకు ముప్పు తెచ్చే వంటగది అలవాట్లు ఇవే.. రోజూ చేసే ఈ తప్పులు..
బరువు తగ్గేందుకు అదిరిపోయే కరకరలాడే ఓట్స్ దోశలు..  కారప్పొడి
బరువు తగ్గేందుకు అదిరిపోయే కరకరలాడే ఓట్స్ దోశలు..  కారప్పొడి
తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా.
తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా.
ఈ లక్షణాలుంటే జాగ్రత్త, మీకు టీబీ ఉండవచ్చు
ఈ లక్షణాలుంటే జాగ్రత్త, మీకు టీబీ ఉండవచ్చు
ఇంట్లో ఈ ప్రదేశాల్లో దీపం వెలిగించకండి.. వాస్తు నియమాలు..
ఇంట్లో ఈ ప్రదేశాల్లో దీపం వెలిగించకండి.. వాస్తు నియమాలు..