AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK: సీఎస్‌కే కోచింగ్ స్టాఫ్‌లో భారీ మార్పులు.. జహీర్ ఖాన్ సిఫార్సుతో జట్టులోకి స్టార్ బౌలర్

CSK: చెన్నై సూపర్ కింగ్స్ కొత్త బౌలింగ్ కోచ్‌గా మాజీ పేసర్ మోహిత్ శర్మ నియమితులయ్యే అవకాశం ఉంది. హెడ్ కోచ్ జహీర్ ఖాన్ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ తెలిపారు. ఐపీఎల్ 2025 వరకు ఆడిన మోహిత్ శర్మ 134 వికెట్లు తీశారు. రాబోయే సీజన్ కోసం సీఎస్‌కే కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు జరుగుతున్నాయి.

CSK: సీఎస్‌కే కోచింగ్ స్టాఫ్‌లో భారీ మార్పులు.. జహీర్ ఖాన్ సిఫార్సుతో జట్టులోకి స్టార్ బౌలర్
Mohit Sharma
Rakesh
|

Updated on: Sep 29, 2026 | 6:55 PM

Share

CSK: ఐపీఎల్ 2027 సీజన్ సమీపిస్తున్న తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మేనేజ్‌మెంట్ జట్టు ప్రక్షాళనపై దృష్టి సారించింది. ఇటీవల జట్టు ప్రధాన కోచ్‌గా భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. హెడ్ కోచ్ మార్పు తర్వాత కోచింగ్ స్టాఫ్‌లో మరిన్ని కీలక మార్పులు చేసేందుకు ఫ్రాంచైజీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా జట్టుకు సేవలు అందించిన మాజీ ఆటగాడికి పెద్ద బాధ్యత అప్పగించాలని యాజమాన్యం యోచిస్తోంది. ఐపీఎల్ 2025 వరకు ఆటగాడిగా కొనసాగిన 38 ఏళ్ల సీనియర్ పేసర్ మోహిత్ శర్మ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆయన కొత్త బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ విషయాన్ని స్వయంగా సీఎస్‌కే సీఈఓ కాసీ విశ్వనాథన్ వెల్లడించారు. కొత్త హెడ్ కోచ్ జహీర్ ఖాన్ స్వయంగా మోహిత్ శర్మ పేరును సూచించినట్లు తెలిపారు. ఆటగాడిగా జట్టుకు అద్భుతమైన సేవలు అందించిన మోహిత్, కోచ్‌గా కూడా అదే జోరు కొనసాగిస్తారని టీమ్ మేనేజ్‌మెంట్ గట్టిగా నమ్ముతోంది.

మోహిత్ శర్మ అద్భుతమైన ఐపీఎల్ కెరీర్

మోహిత్ శర్మ తన సుదీర్ఘ ఐపీఎల్ ప్రయాణంలో నాలుగు అగ్రశ్రేణి జట్లకు ప్రాతినిధ్యం వహించారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల తరఫున బౌలింగ్ చేసి సత్తా చాటారు. గత ఏడాది డిసెంబర్‌లో క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుంచి అధికారికంగా వీడ్కోలు పలికారు. లీగ్‌లో మొత్తం 120 మ్యాచ్‌లు ఆడిన ఆయన 26.21 సగటుతో 134 వికెట్లు పడగొట్టారు. కేవలం 8.77 ఎకానమీతో రన్స్ కట్టడి చేస్తూ కీలక సమయాల్లో వికెట్లు తీసే బౌలర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు.

స్లో బాల్స్‌తో ప్రత్యర్థులకు చుక్కలు

తన విభిన్నమైన స్లోలర్ బంతులు, కట్టర్లతో ఎంతటి దిగ్గజ బ్యాటర్లయినా బోల్తా కొట్టించడంలో మోహిత్ దిట్ట. మ్యాచ్‌లను ఒంటరిగా గెలిపించే సత్తా ఉన్న ఈ పేసర్ అనుభవం ఇప్పుడు సీఎస్‌కే యువ బౌలర్లకు ఎంతో ఉపయోగపడనుంది. జహీర్ ఖాన్ మార్గదర్శకత్వంలో మోహిత్ శర్మ కోచింగ్ బాధ్యతలు స్వీకరిస్తే, చెన్నై బౌలింగ్ విభాగం మరింత బలోపేతం అవుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ జట్టు బౌలింగ్ ప్రణాళికలను రచించడంలో ఆయన పాత్ర కీలకం కానుంది.

రాబోయే రోజుల్లో మరిన్ని కీలక నిర్ణయాలు

రానున్న వారాల్లో కోచింగ్ స్టాఫ్‌కు సంబంధించిన మిగతా నియామకాలు కూడా జరగనున్నాయి. పూర్తిగా హెడ్ కోచ్ జహీర్ ఖాన్ సలహాలు, సూచనల మేరకే ఈ నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆటగాడిగా అదరగొట్టిన మోహిత్ శర్మ ఇప్పుడు కోచ్‌గా చెన్నై జట్టును ఏ విధంగా ముందుకు నడిపిస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం ధోనీ సేన కొత్త వ్యూహాలతో బరిలోకి దిగేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సీఎస్‌కే కోచింగ్ స్టాఫ్‌లో భారీ మార్పులు
సీఎస్‌కే కోచింగ్ స్టాఫ్‌లో భారీ మార్పులు
నిమ్స్‌ అధికారిపై అక్రమాస్తుల ఆరోపణలు.. కట్‌చేస్తే..
నిమ్స్‌ అధికారిపై అక్రమాస్తుల ఆరోపణలు.. కట్‌చేస్తే..
మినప, పెసలు కంటే హై ప్రోటీన్ రిచ్ ఇడ్లీ.. ఉదయం ఒక్క ప్లేట్ తింటే
మినప, పెసలు కంటే హై ప్రోటీన్ రిచ్ ఇడ్లీ.. ఉదయం ఒక్క ప్లేట్ తింటే
ఐఐటీ ఖరగ్ పూర్‌లో చదువు.. కార్పొరేట్ జాబ్.. ఇప్పుడేమో క్రేజీ హీరో
ఐఐటీ ఖరగ్ పూర్‌లో చదువు.. కార్పొరేట్ జాబ్.. ఇప్పుడేమో క్రేజీ హీరో
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
లైసెన్స్ కావాలంటే.. ఏఐని మెప్పించాల్సిందే.. ఇకపై టెస్ట్ పాస్..
లైసెన్స్ కావాలంటే.. ఏఐని మెప్పించాల్సిందే.. ఇకపై టెస్ట్ పాస్..
అల్లరి నరేష్ ఫ్యామిలీని చూశారా? కూతురు ఎంత క్యూట్‌గా ఉందో! ఫొటోస్
అల్లరి నరేష్ ఫ్యామిలీని చూశారా? కూతురు ఎంత క్యూట్‌గా ఉందో! ఫొటోస్
సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడా?
సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడా?
గుండెకు ముప్పు తెచ్చే వంటగది అలవాట్లు ఇవే.. రోజూ చేసే ఈ తప్పులు..
గుండెకు ముప్పు తెచ్చే వంటగది అలవాట్లు ఇవే.. రోజూ చేసే ఈ తప్పులు..
బరువు తగ్గేందుకు అదిరిపోయే కరకరలాడే ఓట్స్ దోశలు..  కారప్పొడి
బరువు తగ్గేందుకు అదిరిపోయే కరకరలాడే ఓట్స్ దోశలు..  కారప్పొడి