AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Don't Trouble The Trouble: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. అందరి కళ్లు ఎన్టీఆర్ పైనే..

Don’t Trouble The Trouble: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. అందరి కళ్లు ఎన్టీఆర్ పైనే..

Rajitha Chanti
|

Updated on: Sep 29, 2026 | 6:43 PM

Share

మలయాళీ హీరో ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఫాంటసీ అడ్వైంచర్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రాన్ని రాజమౌళి సమర్పణలో శశాంక్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గాంధీ జయంతి రోజున అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

మలయాళీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్న లేటేస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఈ చిత్రానికి శశాంక్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్నా్రు. ఈ సినిమా ద్వారా ఫహాద్ ఫాజిల్ తెలుగులో స్ట్రెయిట్ హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన రాజమౌళి, కథలోని ఎమోషన్స్‌కు తాను కన్నీళ్లు ఆపుకోలేకపోయానని, కేవలం ఒకే ఒక్క లైన్‌తో ఈ కథ తన్ను కట్టిపడేసిందని ప్రమోషన్స్ ఈవెంట్‌లో ప్రశంసలు కురిపించారు. దర్శకుడు ఎస్‌. ఎస్‌. రాజమౌళి సమర్పణలో రాబోతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో అత్యంత గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఎన్టీఆర్ రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులతో ఈవెంట్ ప్రాంగణం అభిమానుల కోలాహలంతో, ఈలలు-కేరింతలతో హోరెత్తిపోయింది. ఈ వేడుకను మీరు టీవీ9 తెలుగులో ప్రత్యేక్ష ప్రసారంలో చూడొచ్చు.

Follow Us