AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allari Naresh: హీరో అల్లరి నరేష్ ఫ్యామిలీని చూశారా? కూతురు ఎంత క్యూట్‌గా ఉందో! ఫొటోస్ వైరల్

ఇటీవలే 'రంభ ఊర్వశి మేనక' సినిమాతో ఆడియెన్స్ ను పలకరించాడు హీరో అల్లరి నరేష్. థియేటర్లలో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ఈ సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉంటే.. అల్లరి నరేశ్‌ కూతురు ఇవాళ (సెప్టెంబర్ 29) పదో పుట్టినరోజు జరుపుకొంటోంది.

Allari Naresh: హీరో అల్లరి నరేష్ ఫ్యామిలీని చూశారా? కూతురు ఎంత క్యూట్‌గా ఉందో! ఫొటోస్ వైరల్
Allari Naresh
Basha Shek
|

Updated on: Sep 29, 2026 | 6:29 PM

Share

అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ సినిమా ‘రంభ ఊర్వశి మేనక’. చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ కామెడీ ఎంటర్ టైనర్ లో సురభి హీరోయిన్ గా నటించింది. అలాగే రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 04న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మోస్తరుగానే ఆడింది. ఉన్నంతలో ఆడియెన్స్ ను బాగానే నవ్వించింది. అయితే నెల తిరక్కుండానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం రంభ ఊర్వశి మేనక సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఇవాళ (సెప్టెంబర్ 29) అల్లరి నరేష్ కూతురు అయాన ఏవిక పదో పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన కూతురికి బర్త్ డే విషెస్ తెలిపాడు నరేష్. ఇదే క్రమంలో తన కూతురికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను కూడా షేర్ చేశాడు అల్లరోడు. దీంతో ఇవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నరేష్ కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

కాగా అల్లరి నరేష్ షేర్ చేసిన పోస్టుపై ప్రముఖ హీరోయిన్ కామ్మ జెఠ్మలాని స్పందించింది. హీరో కూతురికి బర్త్ డే విషెస్ చెబుతూ.. ‘అప్పుడే డబుల్‌ డిజిట్‌లోకి వచ్చేశావా బంగారం? పుట్టినరోజు శుభాకాంక్షలు. గాడ్‌ బ్లెస్‌ యూ తల్లి’ అంటూ విషెస్ చెప్పింది. ఆమెతో పాటు నరేష్ తో కలిసి కితకితలు సినిమాలో నటించిన గీతా సింగ్ కూడా ఈ పోస్ట్ కు స్పందించింది. నరేష్ కూతురికి బర్త్ డే విషెస్ చెప్పింది.

ఇవి కూడా చదవండి

అల్లరి నరేష్ పోస్ట్..

కాగా అల్లరి నరేష్ భార్ పేరు విరూప. 2015లో వీరి వివాహం జరిగింది. ఆ మరుసటి ఏడాదే ఈ దంపతులకు అయాన అనే అమ్మాయి పుట్టింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పలు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు అల్లరి నరేష్.

కూతురితో అల్లరి నరేష్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us