AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rewind 2024: రోహిత్ నుంచి బాబర్ వరకు.. ఈ ఏడాది విఫలమైన ఏడుగురు.. పరిస్థితి చూస్తే జాలేయాల్సిందే

2024 Flop Cricketers: 2024లో చాలా మంది క్రికెటర్లు ఒకరి తర్వాత ఒకరు విజయాలు సాధించి రికార్డులు సృష్టించారు. మరోవైపు పేలవ ప్రదర్శనను కొనసాగించిన పలువురు క్రికెటర్లు మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నారు. 2024లో అత్యధికంగా ఫ్లాప్ అయిన ఏడుగురు క్రికెటర్లను ఓసారి చూద్దాం..

Rewind 2024: రోహిత్ నుంచి బాబర్ వరకు.. ఈ ఏడాది విఫలమైన ఏడుగురు.. పరిస్థితి చూస్తే జాలేయాల్సిందే
2024 Flop Cricketers
Venkata Chari
|

Updated on: Dec 31, 2024 | 2:31 PM

Share

Rewind 2024: 2024 చాలా మంది స్టార్ క్రికెటర్లకు వారి ప్రదర్శన పరంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. వీరిలో భారత దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతోపాటు ఇతర ప్రసిద్ధ ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఆటగాళ్ళు 2024లో వారి ప్రదర్శనతో అభిమానులను నిరాశపరచడమే కాకుండా, అవసరమైనప్పుడు తమ జట్టుకు సహాయం చేయలేక చేతులెత్తేశారు. ఈ క్రికెటర్లు 2025లో బలమైన పునరాగమనం చేస్తారని ఆశిద్దాం. అయితే, దానికి ముందు 2024లో అత్యధికంగా ఫ్లాప్ అయిన ఏడుగురు క్రికెటర్లను ఓసారి చూద్దాం.

1. విరాట్ కోహ్లీ: భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి ఈ ఏడాది పీడకలలా మారింది. అతను మొత్తం మూడు ఫార్మాట్లలో 32 ఇన్నింగ్స్‌లలో 655 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 21.83గా ఉంది. ఈ సమయంలో అతను ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలు మాత్రమే చేశాడు.

2. రోహిత్ శర్మ: భారత కెప్టెన్ రోహిత్ శర్మ పరిస్థితి కూడా అలాగే ఉంది. రోహిత్ శర్మ ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 28 మ్యాచ్‌లు ఆడి మొత్తం 1154 పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి కేవలం రెండు సెంచరీలు మాత్రమే వచ్చాయి. అతను ఖచ్చితంగా ఈ సంవత్సరం భారతదేశాన్ని టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అయితే, రోహిత్ తన బ్యాటింగ్‌లో మాత్రం కష్టపడుతున్నాడు.

ఇవి కూడా చదవండి

3. బాబర్ ఆజం: టెస్టులో బాబర్ అజామ్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. పాకిస్థాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజం 2024లో అన్ని ఫార్మాట్లలో కలిపి 34 మ్యాచ్‌లు ఆడాడు. అతని బ్యాట్‌ నుంచి 1,114 పరుగులు వచ్చాయి. అయితే, బాబర్ సగటు 32.76 మాత్రమే. ఈ ఏడాది సెంచరీ కూడా చేయలేదు. కానీ, ఎనిమిది హాఫ్ సెంచరీలు చేశాడు.

4. నజ్ముల్ హుస్సేన్ శాంటో: బంగ్లాదేశ్ ఆటగాడు నజ్ముల్ హొస్సేన్ శాంటో 2024లో అన్ని ఫార్మాట్లలో 25 సగటుతో 961 పరుగులు చేశాడు. కాగా, అతను 34 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టులో ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం 317 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 21 మాత్రమే. అంతే కాకుండా తన కెప్టెన్సీలో కూడా అద్భుతాలు చేయలేకపోయాడు.

5. అబ్రార్ అహ్మద్: మిస్టరీ స్పిన్నర్‌గా పేరొందిన పాకిస్థాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ అన్ని ఫార్మాట్లలో కలిపి 20 వికెట్లు మాత్రమే తీశాడు. కాగా, అతను 13 మ్యాచ్‌లు ఆడాడు. టీ20లో అతని ఆటతీరు బాగానే ఉంది. కానీ, టెస్టుల్లో అతను రాణించలేకపోయాడు. ఆ తర్వాత అతను టెస్టు జట్టు నుంచి కూడా నిష్క్రమించే మార్గం వెతకాల్సి వచ్చింది.

6, 7. క్వింటన్ డి కాక్, గెరాల్డ్ కోయెట్జీ: ఈ జాబితాలో దక్షిణాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్, యువ ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీ కూడా ఉన్నారు. 2024లో టి-20 ఇంటర్నేషనల్‌లో డి కాక్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. 12 మ్యాచ్‌ల్లో 307 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 25.58. దక్షిణాఫ్రికా యువ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీ తన ప్రదర్శనలో నిలకడను ప్రదర్శించడంలో విఫలమయ్యాడు. 2024లో అన్ని ఫార్మాట్లలో 7 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు మాత్రమే తీశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..