India Vs Australia 2020: తొలి రోజు ఆట గురించి మాజీ క్రికెటర్లు ఏమన్నారో తెలుసా? టీం ఇండియా గురించి ఈ విధంగా..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే తొలి టెస్ట్‌లో మొదటి రోజు టీం ఇండియా ఆట తీరు గురించి పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను

India Vs Australia 2020 : ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే తొలి టెస్ట్‌లో మొదటి రోజు టీం ఇండియా ఆట తీరు గురించి పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తొలిరోజు భారత్ ఆధిపత్యం సాగించిన విషయం క్రికెట్ అభిమానులకు తెలిసిన విషయమే. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను ఇండియా 195 పరుగులకు ఆలౌట్ చేయగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఒక వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది.
వీరేంద్ర సెహ్వాగ్ ఇండియ ప్రదర్శన గురించి ఇలా అన్నాడు. బౌలింగ్‌లో మార్పులు, ఫీల్డర్లను మోహరించడంలో రహానె అద్భుతంగా పనిచేశాడని, బౌలర్లు అశ్విన్, బుమ్రా, సిరాజ్ అదరగొట్టారని పొగిడాడు. తొలి రోజు ఆస్ట్రేలియాను 195 పరుగులకే ఆలౌట్ చేయడం అద్భుతం అన్నాడు. ఆధిక్యం సాధించడం మాత్రం బ్యాట్స్‌మెన్ చేతుల్లో ఉందని వారి పనిని గుర్తుచేశాడు. వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. తొలిరోజు టీం ఇండియా అదరగొట్టిందన్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లో సిరాజ్, గిల్ ఆత్మవిశ్వాసంతో ఆడారు. సారథిగా రహానె సత్తాచాటాడని కొనియాడాడు. ఆకాశ్ చోప్రా తన అభిప్రా యం వ్యక్తం చేస్తూ.. మొదట్లోనే అశ్విన్‌కు బంతిని అందించడం, రెండో సెషన్‌లో సిరాజ్‌తో బౌలింగ్ చేయించిన తీరు ఆసక్తికరంగా ఉన్నాయన్నారు. ఎత్తుగడలు ఫలించాయని పొగిడారు. ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ బౌలర్లు వారి బాధ్యతను నిర్వర్తించారు ఇక బ్యాట్స్‌మెన్‌దే భారం మొత్తం అన్నాడు.



