Not Out But : ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ నాటౌట్‌పై వివాదం…థర్డ్ అంపైర్ నిర్ణయంను తప్పుబడుతున్న సీనియర్లు..
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ నాటౌట్ పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనిపైషేన్ వార్న్ సహ పలువురు మాజీలు తప్పుపడుతున్నారు. తొలిరోజు ఆటలో క్రీజులైన్పై పైన్ బ్యాట్ పెట్టడం..

Not Out But : బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ నాటౌట్ పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనిపైషేన్ వార్న్ సహ పలువురు మాజీలు తప్పుపడుతున్నారు. తొలిరోజు ఆటలో క్రీజులైన్పై పైన్ బ్యాట్ పెట్టడం.. టీమిండియా కీపర్ పంత్ వికెట్లను గ్లౌజ్‌తో తాకడం దాదాపు ఒకేసారి జరిగాయి. బ్యాట్ క్రీజులైన్ లోపల ఉందని భావించిన థర్డ్ అంపైర్ పైన్ నాటౌట్ అని ప్రకటించాడు.
అయితే థర్డ్ అంపైర్ నిర్ణయంతో షాకయ్యానని ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అభిప్రాయపడ్డారు. టిమ్ పైన్‌ను రనౌట్‌గా ప్రకటించకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. తాను చాలా జాగ్రత్తగా పరిశీలించానంటూ పేర్కొన్నారు. క్రీజ్ లైన్‌ను బ్యాట్ దాటలేదనే అనుకుంటున్నా… తన ఉద్దేశంలో అతడు ఔట్ అయ్యాడని షేన్ వార్న్ స్పష్టం చేశాడు.
Very surprised that Tim Paine survived that run out review ! I had him on his bike & thought there was no part of his bat behind the line ! Should have been out in my opinion
— Shane Warne (@ShaneWarne) December 26, 2020
పైన్‌ను ఔట్ ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు భారత మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా. అది కచ్చితంగా ఔట్ అని అన్నారు. అంపైర్ నిర్ణయం తర్వాత స్క్వేర్ లెగ్ అంపైర్‌తో మాట్లాడాడు భారత సారథి రహానె.
అయితే ఆ రనౌట్ నుంచి తప్పించుకున్నప్పటికీ, ఆ ఛాన్స్‌ను పైన్ ఎక్కవ సేపు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కొద్దిసేపటికే అశ్విన్ అతడిని పెవిలియన్‌కు పంపించాడు. తొలి భారత బౌలర్లపై ప్రశంసలు కురుస్తున్నాయి.




