సెన్సార్ పూర్తిచేసుకున్న ‘ఇస్మార్ట్’ హీరో సినిమా.. వచ్చే ఏడాదిలో రిలీజ్ కానున్న ‘రెడ్’.. ఎప్పుడంటే ?
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్సాఫీసులను షేక్ చేశాడు హీరో రామ్. ఆ తర్వాత తిరుమల కిశోర్ దర్శకత్వంలో రెడ్ సినిమాలో నటిస్తున్నాడు ఈ ఎనర్జిక్ స్టార్. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్సాఫీసులను షేక్ చేశాడు హీరో రామ్. ఆ తర్వాత తిరుమల కిశోర్ దర్శకత్వంలో రెడ్ సినిమాలో నటిస్తున్నాడు ఈ ఎనర్జిక్ స్టార్. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ ప్రక్రియ పూర్తవడంతో.. సంక్రాంతి కానుకా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహకాలు చేస్తోంది చిత్రయూనిట్.
ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత రవికిశోర్ మాట్లాడుతూ.. రెడ్ సినిమా సెన్సార్ పూర్తైంది. U/A సర్టిఫికేట్ వచ్చింది. సంక్రాంతి కానుకగా దేవదాసు, మస్కా చిత్రాల తర్వాత వస్తున్న రామ్ సినిమా రెడ్. ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారో ఆ అంశాలన్ని ఈ సినిమాలో ఉంటాయని తెలిపారు. కాగా ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ చేశాడు. దీంతో ఈ సినిమాపై అభిమానులకు అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాకు ఇస్మార్ట్ శంకర్‌కు ఆల్బమ్ అందించిన మణిశర్మ ఆల్బమ్ అందించారు. రామ్ నటించిన రెడ్ సినిమాను జనవరి 14న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్‌లో భారీగా ట్రేండ్ అవుతుంది. మరీ ఈ సినిమాతో రామ్ మరో సూపర్ హిట్ సాధించనున్నాడా? లేదా అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.