సౌత్ రీమెక్‏లో ఆఫర్ దక్కించున్న ‘ఆదిపురుష్’ రావణ్.. బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో కీలక పాత్ర..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సినిమాలో రావణుడి పాత్ర గురించి కొన్ని వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డాడు ఈ టాప్ హీరో.

సౌత్ రీమెక్‏లో ఆఫర్ దక్కించున్న 'ఆదిపురుష్' రావణ్.. బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో కీలక పాత్ర..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 26, 2020 | 7:25 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సినిమాలో రావణుడి పాత్ర గురించి కొన్ని వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డాడు ఈ టాప్ హీరో. తానాజీ 3డిలో క్రేజీ విలన్‏గా సైఫ్ నటించడంతో ఆదిపురుష్ సినిమాలోనూ విలన్‏గా నటించే అవకాశం వచ్చింది. అయితే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‏తో కలిసి కీలకపాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. బాలీవుడ్ హీరో హృతిక్ ప్రస్తుతం ఓ సౌత్ రీమేక్‏లో నటించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.

సౌత్‏లో విజయ్ సేతుపతి, ఆర్. మాధవన్ నటించిన విక్రమ వేద రీమేక్‏లో సైఫ్ అవకాశం దక్కించుకున్నాడు. ఈ సినిమాలో హృతిక్ మ్యాడీ సేతుపతి పోషించిన గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తుండగా.. సైఫ్ మాధవన్ పోషించి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లుగా సమాచారం. ఒక తెలివైన గ్యాంగ్ స్టర్‏ను పోలీసులు పట్టుకున్న ప్రతీసారి తన జీవిత కథ నుంచి తీసిన కొత్త కథను చెబుతూ తప్పించుకుంటారు. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండడం కొంత ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమాకు పుష్కర్ గాయత్రి దర్శకత్వం వహించనుండా.. నీరజ్ పాండే క్రియేటివ్ సపోర్ట్‏తో ఈ చిత్రం తెరకెక్కనుంది.