Pakistan cricket new controversy: ECB సస్పెండ్ చేసింది.. కట్ చేస్తే అదే ఏజెంట్‌తో దోస్తానా చేస్తున్న మాజీ పాక్ కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ మళ్లీ కొత్త వివాదంలో చిక్కుకుంది. ECB నిషేధించిన ICA ఏజెంట్ ముగిజ్ అహ్మద్ షేక్‌తో ఒక మాజీ పాక్ కెప్టెన్ నడుస్తున్న సంబంధాలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ ఏజెంట్ అవినీతి ఆరోపణలతో నిషేధానికి గురైందే కానీ, అతని సహాయంతో యువ క్రికెటర్ల ఒప్పందాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన పాక్ క్రికెట్ పరువు దెబ్బతీసే ప్రమాదం ఉంది.

పాకిస్తాన్ క్రికెట్ ఎప్పుడూ వివాదాల నుంచి బయటపడటం లేదు. మైదానంలో ఆటను మెరుగుపర్చే ప్రయత్నాల్లో ఉండగా, మళ్లీ ఒక కొత్త వివాదం చుట్టుముట్టింది. గతంలో అవినీతి ఆరోపణలు, స్పాట్ ఫిక్సింగ్, పాలనా సమస్యలతో ఇప్పటికే ప్రపంచ క్రికెట్ వేదికపై ప్రతిష్టను కోల్పోయిన పాకిస్తాన్ క్రికెట్ మరోసారి విమర్శల పాలైంది.
ఈసారి వివాదాస్పద వ్యక్తి ఒక మాజీ పాకిస్తాన్ కెప్టెన్. అతను అంతర్జాతీయ క్రికెట్ అసోసియేషన్ (ICA)కి చెందిన సస్పెండ్ అయిన ఏజెంట్ ముగిజ్ అహ్మద్ షేక్‌తో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ECB (ఇంగ్లాండ్ & వేల్స్ క్రికెట్ బోర్డు) షేక్‌ను అవినీతి ఆరోపణల కారణంగా నిషేధించగా, ఈ మాజీ కెప్టెన్ అతనితో కలిసి పని చేస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి.
ముగిజ్ అహ్మద్ షేక్ ఒక బ్రిటిష్-పాకిస్తాని క్రికెట్ ఏజెంట్. ఇతను ఇంగ్లాండ్ & వేల్స్ క్రికెట్ బోర్డులో రిజిస్టర్డ్ ప్లేయర్ ఏజెంట్‌గా ఉండేవాడు. అయితే, ECB నిర్వహించిన దర్యాప్తులో షేక్ నాలుగుసార్లు అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘించాడని తేలింది. దాంతో, ECB అతని లైసెన్స్‌ను రద్దు చేసింది.
అతనిపై వచ్చిన ప్రధాన ఆరోపణ ఏమిటంటే, అతను తనకు ఇష్టమైన ఆటగాళ్లను జట్టులోకి తేవడానికి ఒక ప్రముఖ బ్రిటిష్ కోచ్‌ను అక్రమ ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ప్రయత్నించాడట. దీనికి తోడు, అతను వివాదాస్పదంగా నడుస్తున్న ఒక కంపెనీ ద్వారా యువ క్రికెటర్లకు ఒప్పందాలు తెచ్చేందుకు కృషి చేశాడని ఆరోపణలు ఉన్నాయి.
ఈ వివాదంలో మరింత చర్చనీయాంశమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్‌లో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్న మాజీ కెప్టెన్ ఈ ICA ఏజెంట్ షేక్‌తో సన్నిహితంగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అతను యువ ఆటగాళ్ల ఒప్పందాలను పొందడంలో కీలక పాత్ర పోషించాడని నివేదికలు చెబుతున్నాయి.
ఈ ఆరోపణలు నిజమైతే, ఇది పాకిస్తాన్ క్రికెట్‌పై మరింత ప్రతికూల ప్రభావాన్ని చూపించవచ్చు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌లో శక్తివంతమైన జట్టుగా గుర్తింపు పొందిన పాకిస్తాన్, ఇటీవలి కాలంలో వరుస వివాదాలతో నష్టపోతోంది. మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉండటమే కాక, మేనేజ్‌మెంట్, ప్లేయర్ సెలెక్షన్, అవినీతి ఆరోపణలు మరింత దెబ్బ కొడుతున్నాయి.
ఈ వివాదం బయటకు వచ్చిన తర్వాత, పాకిస్తాన్ జట్టుకు చెందిన పలువురు క్రికెటర్లు ICA ఏజెంట్‌తో ఉన్న తమ సంబంధాలను తెంచుకున్నారు. వారిలో అబ్దుల్లా షఫీక్, సర్ఫరాజ్ అహ్మద్, ఉసామా మీర్, మరికొందరు ప్రముఖ ఆటగాళ్లు ఉన్నారు. ECB నిషేధించిన ICA ఏజెంట్‌తో పాటు, అతనికి అనుబంధంగా ఉన్న కంపెనీ కూడా నిషేధానికి గురైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..