England: ఇంగ్లండ్ ఆల్ రౌండర్‌కి భారీ షాక్.. ఈసీబీ దెబ్బకు ఆ లిస్ట్ నుంచి ఔట్.. క్రికెట్‌కి గుడ్‌బై?
ECB Central Contract 2023: పురుషుల క్రికెటర్ల కోసం కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్‌ను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది. అయితే, ఇందులో వెటరన్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌కి భారీ షాక్ తగిలింది. దీంతో ఇకపై క్రికెట్ ఆటకు గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. బెన్ స్టోక్స్‌ను ఒక సంవత్సరం కాంట్రాక్ట్‌లో ఉంచడం వల్ల ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ త్వరలో క్రికెట్‌కు దూరం కావచ్చని స్పష్టమవుతుంది. స్టోక్స్ గత 9 సంవత్సరాలుగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్‌లో భాగంగా ఉన్నాడు.

ECB Central Contract 2023: ఇంగ్లండ్ దిగ్గజ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ 2023లో ఇప్పటివరకు ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. అందులోనూ పెద్దగా ఆకట్టుకోలేదు. వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి మరీ, ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని ఈ ప్రపంచకప్ బరిలో నిలిచాడు. ఇదిలా ఉంటే, స్టోక్స్ త్వరలో క్రికెట్‌కు దూరం కావచ్చని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సూచించింది. ఇంగ్లండ్ టెస్టు జట్టుకు స్టోక్స్ కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్‌లో స్టోక్స్‌కు ఒక సంవత్సరం విభాగంలో మాత్రమే స్థానం లభించింది.
పురుషుల సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ఇంగ్లండ్ ప్రకటించింది. ఇందులో మొదటిసారిగా ECB ఆటగాళ్లకు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాంట్రాక్టులను ఇచ్చింది. కాంట్రాక్టులు ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు మూడు కేటగిరీలుగా విభజించారు. ఇందులో బెన్ స్టోక్స్ ఒక సంవత్సరం కాంట్రాక్ట్ కింద మాత్రమే ఉంచారు. ఇది కాకుండా, మూడు, రెండు సంవత్సరాల కాంట్రాక్ట్‌లలో మొత్తం 18 మంది ఆటగాళ్లను చేర్చారు. ఇందులో మొదటిసారిగా పూర్తి కాంట్రాక్ట్‌లో భాగమైన చాలా మంది ఆటగాళ్లు కూడా ఉన్నారు.




ఇటువంటి పరిస్థితిలో బెన్ స్టోక్స్‌ను ఒక సంవత్సరం కాంట్రాక్ట్‌లో ఉంచడం వల్ల ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ త్వరలో క్రికెట్‌కు దూరం కావచ్చని స్పష్టమవుతుంది. స్టోక్స్ గత 9 సంవత్సరాలుగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్‌లో భాగంగా ఉన్నాడు. ‘ESPNcricinfo’ ప్రకారం, ప్రపంచ కప్ తర్వాత వన్డే క్రికెట్ ఆడతారా అని బెన్ స్టోక్స్‌ని విలేకరులు ప్రశ్నించారు. అయితే, ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఇంగ్లండ్ తరపున వీలైనంత ఎక్కువ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. మొయిన్ అలీ, జేమ్స్ ఆండర్సన్ వంటి ఆటగాళ్లను కూడా ఒక సంవత్సరం కాంట్రాక్ట్‌లో భాగంగా చేశారు.
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ ప్రకటించిన సెంట్రల్ క్రాంటాక్ట్ లిస్ట్..
🗞️ We've announced our England Men's Central Contract offers for 2023-24…
And seven players have received offers for the first time!
Find out more 👇
— England Cricket (@englandcricket) October 24, 2023
మూడేళ్ల కాంట్రాక్ట్‌లో ఉన్న ఆటగాళ్లు – హ్యారీ బ్రూక్, జో రూట్, మార్క్ వుడ్.
రెండేళ్ల కాంట్రాక్ట్‌లో ఉన్న ఆటగాళ్లు: రెహన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్, బ్రైడెన్ కార్సే, జాక్ క్రాలే, సామ్ కర్రాన్, బెన్ డకెట్, లియామ్ లివింగ్‌స్టోన్, ఒల్లీ పోప్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, జోష్ టోంగ్, క్రిస్ వోక్స్
ఒక సంవత్సరం కాంట్రాక్ట్‌లో ఉన్న ఆటగాళ్లు – మొయిన్ అలీ, జేమ్స్ ఆండర్సన్, బెన్ ఫాక్స్, జాక్ లీచ్, డేవిడ్ మలన్, ఆలీ రాబిన్సన్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లీ.
డెవలప్‌మెంట్ కాంట్రాక్ట్స్- మాథ్యూ ఫిషర్, సాకిబ్ మహమూద్, జాన్ టర్నర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




