- Telugu News Photo Gallery Cricket photos From Shahid Afridi to Andrew Symonds These 2 cricketers banned for silly reasons
Banned: విచిత్ర కారణాలతో నిషేధానికి గురైన ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు.. పేర్లు తెలిస్తే ఆశ్చర్యపోతారంతే?
క్రికెట్‌లో ఎప్పుడ ఏం జరుగుతుందో చెప్పలేం. అయితే, కొందరు ఆటగాళ్లు ఐసీసీ లేదా ఆయా బోర్డుల నుంచి నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది మాత్రం విచిత్రమైన కారణాలతో నిషేధానికి గురయ్యారు. వీరి కారణాలు చాలా సిల్లీగా ఉన్నాయి. ఈ లిస్టులో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. వారెవరు, ఆ కాణాలేంటో ఇప్పుడు తెలుసకుందాం..
Updated on: Oct 25, 2023 | 6:40 AM

క్రికెట్ ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండదు. ఎప్పటికప్పుడు ఆటగాళ్ల ప్రవర్తన వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. మ్యాచ్ ఫిక్సింగ్ నుంచి హింస, అసభ్య పదజాలంతో కొంతమంది అత్యుత్తమ ఆటగాళ్లపై నిషేధం ఎదుక్కొన్నారు. ఈ ఆటగాళ్ల నిషేధం వెనుకు లెక్కలేనన్ని కారణాలు ఉన్నాయి. కాగా, కొంతమంది ఆటగాళ్లు ఒకటి లేదా రెండు మ్యాచ్‌లకు, కొన్నిసార్లు మొత్తం సిరీస్ నుంచి విచిత్రమైన కారణాలతో సస్పెండ్ అయిన ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఈ లిస్టులో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..

1. ఆండ్రూ సైమండ్స్: దివంగత ఆండ్రూ సైమండ్స్ తన ఫిషింగ్ ఆటకు ప్రసిద్ధి చెందాడు. అయితే అతని అభిరుచిని క్రికెట్‌తో కలపాలనే ఆలోచన సరికాలేదు. 2008లో సైమండ్స్ జట్టు సమావేశాన్ని విడిచిపెట్టి చేపల వేటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు ముందు జట్టును సమావేశానికి పిలిచారు.

సైమండ్స్‌కు సమావేశం గురించి తెలియదు. చేపలు పట్టడానికి బయలుదేరాడు. ఈ ఘటన తర్వాత అతడిని నెల రోజుల పాటు ఇంటికి పంపించారు. ఆటపై దృష్టి సారించేందుకు సైమండ్స్‌కు మైదానం వెలుపల కొంత సమయం ఇవ్వాలని నిర్ణయించారు.

2. షాహిద్ అఫ్రిది: ఐదు వన్డేల సిరీస్‌లో చివరి వన్డే పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది. అదే సమయంలో షాహిద్ అఫ్రిది బంతిని కటింగ్ చేస్తూ దొరికిపోయాడు. అతను రానా నవేద్ ఉల్ హసన్‌తో కలిసి నడుస్తున్న సమయంలో ఈ సంఘటన కెమెరాలో నమోదైంది. ఇలా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బాల్ ట్యాంపరింగ్ నిబంధనను ఉల్లంఘించాడు.

ఈ నిబంధనల ప్రకారం, 'ఆటగాళ్లు చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా బంతి స్థానాన్ని మార్చడానికి చేసే ఏదైనా ప్రయత్నం కోడ్ ఉల్లంఘన, శిక్షకు గురవుతుంది'. నిబంధనలను ఉల్లంఘించిన తర్వాత అఫ్రిది రెండు టీ20 మ్యాచ్‌ల నిషేధానికి గురయ్యాడు. మ్యాచ్ హీట్ కారణంగా తాను తప్పు చేశానని, అందుకు క్షమాపణలు చెబుతున్నానంటూ చెప్పుకొచ్చాడు.





























