- Telugu News Photo Gallery Cricket photos South Africa key Player Quinton De Kock Breaks AB De Villiers Centuries Records against Bangladesh
Quinton de Kock: కోహ్లీ క్లోజ్ ఫ్రెండ్ రికార్డ్ బ్రేక్ చేసిన డి కాక్.. తొలి ప్లేయర్‌గా సరికొత్త చరిత్ర..
South Africa vs Bangladesh, 23rd Match: బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 140 బంతులు ఎదుర్కొన్న క్వింటన్ డి కాక్ 7 భారీ సిక్సర్లు, 15 ఫోర్లతో 174 పరుగులు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో క్వింటన్ డి కాక్ మూడు సెంచరీలు సాధించాడు. బంగ్లాదేశ్‌పై సెంచరీకి ముందు, డి కాక్ శ్రీలంక, ఆస్ట్రేలియాపై సెంచరీలు చేశాడు. కాగా, ఈ ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ కానున్న సంగతి తెలిసిందే. తన చివర ప్రపంచకప్ ఆడుతున్న డికాక్.. అద్భుతమైన ఫాంతో దూసుకపోతున్నాడు.
Updated on: Oct 24, 2023 | 7:11 PM

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 23వ మ్యాచ్‌లో క్వింటన్ డి కాక్ భారీ సెంచరీతో ఎన్నో రికార్డులు సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో డికాక్ 101 బంతుల్లో సెంచరీ సాధించాడు.

ఈ సెంచరీతో ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌గా క్వింటన్ డి కాక్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉండేది.

2011 ప్రపంచ కప్‌లో, AB డివిలియర్స్ 2 సెంచరీలు చేయడం ద్వారా ఒకే ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ఈ ప్రపంచకప్‌లో క్వింటన్ డి కాక్ మూడు సెంచరీలు సాధించాడు. బంగ్లాదేశ్‌పై సెంచరీకి ముందు, డి కాక్ శ్రీలంక, ఆస్ట్రేలియాపై సెంచరీలు చేశాడు.

ఈ మూడు సెంచరీలతో ఒకే ప్రపంచకప్‌లో 3 సెంచరీలు సాధించిన తొలి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అలాగే, శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర తర్వాత, ఒకే ప్రపంచకప్‌లో 3 సెంచరీలు చేసిన రెండో వికెట్ కీపర్‌గా నిలిచాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 140 బంతులు ఎదుర్కొన్న క్వింటన్ డి కాక్ 7 భారీ సిక్సర్లు, 15 ఫోర్లతో 174 పరుగులు చేశాడు.




